శ్రీ అనసూయేశ్వరాలయ ముఖమంటప ప్రవేశ ద్వారంపైన శ్రీ మహాలక్ష్మీదేవి, ద్వారాని కిరువైపుల జయవిజయులు; గర్భాలయ ప్రవేశ ద్వారం పైన శంఖ చక్రాలు, ఊర్థ్వపుండ్రాలను దర్శించగానే అమ్మాలయం శ్రీ లక్ష్మీనారాయణ నిలయం అని స్ఫురిస్తుంది.
అమ్మ ప్రత్యక్ష సన్నిధిలో ప్రారంభమైన ధనుర్మాస పూజల్ని ఏటా వైభవంగా నిర్వహించు కుంటున్నాము. సూర్యోదయాత్పూర్వమే నామసంకీర్తన, తిరుప్పావై పఠనం, శ్రీ విష్ణుసహస్రనామస్తోత్ర పారాయణ, తులసీదళ అర్చన, దధ్యోదనం – చక్కెర పొంగలి వంటి విశేష నివేదనలతో అమ్మను సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిగా అర్చించుకుంటున్నాము.
16-12-2022 నుండి 14-1-2023 వరకు ధనుర్మాస పూజలు నిర్వహింపబడును. 2-1-2023 ముక్కోటి ఏకాదశి. సోదరీ సోదరులు తమ గోత్రనామాలతో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొని తరించటానికి SVJP Trust, SVJP Temples Trust సకల సౌకర్యాలను కలుగచేస్తోంది.
ఆసక్తి గలవారు సంప్రదించండి.
- MVR సాయిబాబు : 9441838771
- V. రమేష్ బాబు : 9490604621
విశేష అర్చనలు – నివేదనల నిమిత్తం విరాళములను online లో పంపవలసిన Bank A/c వివరాలు: SVJP Temples Trust, HDFC A/c No. 59119431968505, IFSC : HDFC 0002642
– SVJP Trusts, జిల్లెళ్ళమూడి