ధాన్యాభిషేకం 17.2.2010 న
ఆహ్వానము
అన్నపూర్ణాలయం అమ్మ అనుగ్రహానికి ప్రతిరూపం. ఎవరు దర్శనం చేసుకోవడానికి అమ్మ వద్దకు వచ్చినా ముందు భోజనం చేసి రమ్మనేది. చేసి వచ్చానమ్మా అంటే కొద్దిగా ప్రసాదంగా తీసుకురమ్మనేది. బిడ్డ ఆకలి అమ్మకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదు. ఆకలికి పేద, ధనిక తేడా లేదని, ఎంత ధనం ఉన్నా, ఆస్తులు వున్నా అవేవీ ఆకలిని పోగొట్టలేవని అమ్మ భావించింది. అన్ని బాధల కంటే ఆకలిబాధ ఎక్కువ అనిపిస్తుంది నాకు అనేది అమ్మ. తల్లికి బిడ్డ ఆకలే ముఖ్యం అన్నది. అమ్మ అవతార రహస్యం అన్నపూర్ణాలయంలో అన్నం పెట్టడమేనని, అమ్మ పెట్టే ముద్దలో ఎన్ని మెతుకులు వున్నాయో అమ్మ దయవలన అన్ని జన్మలు లయమైనట్లేనని సద్గురు శ్రీ శివానందమూర్తిగారు వివరించారు. అట్టి మహోదాత్తమైన అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించి 51 సంవత్సరాలు పూర్తి అయింది.
అమ్మ వంటఇల్లే అన్నపూర్ణాలయమయింది. అమ్మ సాన్నిధ్యాన్ని మనందరికి ప్రసాదించిన నాన్నగారు మనకు అనసూయేశ్వరులైనారు. నాన్నగారి ఆరాధనోత్సవ సందర్భంగా కార్యక్రమము ధ్యానాభిషేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన రూపొందించడం ఎంతో ఔచిత్యంగా ఉన్నది. అన్నపూర్ణాలయ నిర్వహణకు అనసూయేశ్వరాలయ వార్షికోత్సవం నాడు అమ్మ, నాన్నగార్లకు అభిషేకించిన ధాన్యం వినియోగించబడు చున్నది. నిరంతరం జరిగే ఈ నిరతాన్నవితరణ కార్యక్రమాన్నే అమ్మ మాతృయాగమని సంగావన చేసింది. దీని నిర్వహణ అమ్మ బిడ్డలందరి బాధ్యత.
ఈ మాతృయాగంలో పాల్గొనదలచిన వారు ఒక బస్తా బియ్యంగాని లేదా దానికి సమానమైన రూ. 2,000/- గాని ఒక బస్తా ధాన్యం దానికి సమానమైన రూ. 1,000/-లు గాని సమర్పించి స్వయంగా అర్చించుకోవచ్చు లేదా వారి తరఫున ఎవరైనా పాల్గొనవచ్చు. రాలేని వారి పేర కూడా ధాన్యాభిషేకం జరిపి వారికి ప్రసాదం పంపబడుతుంది. శాశ్వత ధాన్యాభిషేక పధకం క్రింద రూ.10,000/-లు ఆపైన చెల్లించిన వారి పేర ప్రతి సంవత్సరం ధాన్యాభిషేకం జరిపి ప్రసాదం పంపబడుతుంది. మీకు వస్తురూపేణా గానీ, ధనరూపేణాగానీ యిచ్చి ధాన్యాభిషేకంలో పాల్గొనవచ్చు.
అన్నపూర్ణాలయ నిర్వహణకొరకు ఏర్పడిన ఈ కార్యక్రమములో అందరూ పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగోరుచున్నాము.
అన్నిదానములందు అన్నదానమె ముందు – అక్షయమ్మదియేను అమ్మసన్నిధియందు
జిల్లెళ్ళమూడి
గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్
ఇట్లు
శ్రీ విశ్వజననీపరిషత్, జిల్లెళ్ళమూడి
ఫోన్: 08643-227324, 227492
Email: svjp#amma@gmail.com