చిరకాలంగా ఎదురుచూస్తున్న ‘మాతృశ్రీ వేద స్మార్త పాఠశాల’ 2-6-2010 తేదీ బుధవారం నాడు ప్రారంభమగును. పాఠశాల నడుపుటకు వేద, స్మార్త అధ్యాపకులు కావలెను. భోజన, వసతి, జీతబత్తెముల వివరములకు ఈ క్రింది చిరునామాను సంప్రదించగలరు.
10 సంవత్సరముల లోపు ఉపనయనము అయిన బాలురు వేద, స్మార్త, విద్యాభ్యాసం నిమిత్తం దరఖాస్తు
చేయగలరు. విద్యార్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యము కలదు.
జిల్లెళ్ళమూడి
26.4.2010
ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం, కార్యదర్శి,
సెల్ నెం : 9963431087
జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ సంస్కృత కళాశాలలో
కంప్యూటర్ లాబ్ ప్రారంభం
5.5.2010 అమ్మ కళ్యాణదినోత్సవం నాడు మాతృశ్రీ సంస్కృత కళాశాలలో కంప్యూటర్ లాబ్ ప్రారంభించబడును. మనకళాశాల విద్యార్థులకు ఉచిత బోధన.
మద్రాసు నుండి శ్రీ చుండూరు నగేష్ (ఇంజనీర్ తాతయ్య కుమారుడు) 21 కంప్యూటర్లు ఉదారంగా అందించారు. లాబు అవసరమై టేబుల్స్, ఎలక్ట్రిక్ వైరింగ్, ఫాల్స్ రూఫింగ్, ఎ.సి. సౌకర్యములు సోదరుడు శ్రీ జేమ్స్ కాంపియన్ ఉచితంగా సమకూర్చారు. పరిషత్ అధ్యక్షులు శ్రీ బి. రామబ్రహ్మంగారు నిర్వహణకయ్యే ఖర్చును విరాళాల రూపంలో సేకరించే బాధ్యత స్వీకరించారు. లేబరేటరీ ఏర్పాటును శ్రీ కవిరాయని రాజేంద్రప్రసాద్, శ్రీ శరశ్చంద్ర కుమార్ పర్యవేక్షించారు.
నాదెండ్ల లక్ష్మణరావు
కార్యదర్శి, విద్యాపరిషత్, జిల్లెళ్ళమూడి
అమ్మకు రాగనీరాజనమ్
అమ్మ అవతరించి 88 సంవత్సరాలు అమ్మ ఆలయంలో చేరి 25 సంవత్సరాలు..
అమ్మ అనంతోత్సవాల సందర్భంగా 12.6.2010 శనివారంనాడు అమ్మను గూర్చి మాన్యసోదరులు సర్వశ్రీ
రాజుబావ, నదీరా, రామకృష్ణన్నయ్య, యార్లగడ్డ రాఘవయ్య, నా రాధాకృష్ణ, పి.యస్.ఆర్. వంటి వారెందరో వ్రాసిన పాటలలో 88 ఎన్నిక చేసి అమ్మకు రాగనీరాజనం సమర్పిస్తే బాగుంటుందని సోదరుడు శ్రీ హనుమబాబుకు అమ్మ ప్రేరణ ఇచ్చింది. శ్రీ విశ్వజననీపరిషత్ ఆ కార్యక్రమ సంయోజన బాధ్యత వారికి అప్పగించింది.
అమ్మ పాటలు బాగా పాడగలవారు తాము ఏ పాటలు పాడగలరో ఎన్నికచేసుకొని తమ సంసిద్ధతను మీ వివరములను ఫోనునెంబర్ సహ ఈ క్రింది చిరునామాకు తెలియకోరుచున్నాము.
వివరములకు
ఐ. హనుమబాబు,
C/o. స్థానిక కార్యదర్శి, శ్రీ విశ్వజననీపరిషత్ జిల్లెళ్ళమూడి,
బాపట్లమండలం, గుంటూరుజిల్లా
మాతృశ్రీ విద్యాపరిషత్ కు ఇన్కంటాక్స్ ఎగ్జంప్షన్
మాతృశ్రీ విద్యాపరిషత్కు ఇచ్చే ఏ విధమైన విరాళములకైనా గుంటూరు ఇన్కంటాక్స్ కమీషనర్ గారి ఉత్తరువు 22/80G/BPTL/CIT-GNT/09-10 dated 22.4.2010 ప్రకారం 2010 ఏప్రియల్ 1 నుండి 80G ఎగ్జాంప్షన్ వర్తించును.
కార్యదర్శి – మాతృశ్రీ విద్యాపరిషత్
జిల్లెళ్ళమూడి.