అన్నదాతా సుఖీభవ! అనసూయమాతా జయీభవ!!
నాలుగు ప్రాంతాల్లో 5-5-2021 అమ్మ నాన్నగారల కళ్యాణ దినోత్సవ పర్వదిన సందర్భంగా:
1) నాగోల్ లోని ‘నిర్వాణ ఫౌండేషన్ (పేద వృద్ధుల డే కేర్సెంటర్) లో నిర్వహించారు. 25 మంది బాలబాలికలు, వృద్ధులకు అమ్మ (అన్న) ప్రసాదాన్ని (వివాహ భోజనాన్ని) అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయాన్ని అందించారు.
2) లింగోజిగూడ (సరూర్నగర్) లోని ‘మైత్రేయి ఫౌండేషన్ (పేద వృద్ధుల డే కేర్ సెంటర్) లో నిర్వహించారు. పూజాదికముల అనంతరము అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆదరంగా అందించారు. సేవాకార్యక్రమానికి కూడా శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీమతి అనంత సీతాలక్ష్మి దంపతులే ఆర్థిక సహాయాన్ని అందించారు.
3) నల్లగండ్లలోని ‘శిశుమంగళ’ అనాధ బాలబాలికల ఆశ్రమంలో నిర్వహించారు. బాలబాలికలు భక్తిశ్రద్ధలతో అమ్మనామ సంకీర్తన పూజాదికములలో పాల్గొన్నారు. వారందరికీ అమ్మ (అన్న) ప్రసాదంతో పాటు పళ్ళు కూడా సాదరంగా పంచారు. శ్రీ తంగిరాల సింహాద్రిశాస్త్రి శ్రీమతి విజయలక్ష్మి దంపతులు తమ మనవడు చిరంజీవి తంగిరాల రిత్విక్ (శ్రీ తంగిరాల హైమానంద్ శ్రీమతి శిరీష దంపతుల తనయుడు) జన్మదిన శుభసందర్భంగాను, అమ్మ కళ్యాణదినోత్సవ శుభ సందర్భంగాను ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
4) నారాయణగూడ లోని ‘అనురాగనిలయం’ వృద్ధాశ్రమంలో నిర్వహించారు. అమ్మ పూజాదికములు,
నివేదన, హారతి అనంతరం అందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని సంతోషంగా అందించారు. వీనిని ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీమతి భ్రమరాంబ భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. ఈ సేవాకార్యక్రమానికి శ్రీ బి.వి. రామశాస్త్రి, శ్రీమతి ఉమదంపతులు ఆర్థిక సహాయాన్ని అందించారు.
5) 6-5-2021న JASS ఆధ్వర్యంలో నారాయణ గూడలోని ‘అనురాగ నిలయం’లోనే ప్రేమార్చన నిర్వహించారు. యథావిధిగా జగజ్జనని ‘అమ్మ’కి పూజాదికములను నిర్వహించిన పిమ్మట ఆశ్రమ వాసులందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆదరంగా అందించారు. శ్రీ బి.వి. రామశాస్త్రిగారు తమ సోదరులు కీ.శే. బి. అప్పల నరసింహంగారి వర్ధంతి సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
6) 22-5-2021న నల్లకుంటలోని బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. అమ్మకి పూజాదికములు, నివేదన అనంతరము ఆశ్రమ వాసులందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆదరంగా పంచారు. ఆ సేవాకార్యక్రమానికి స్వర్గీయ శ్రీమతి మైలవరపు సత్యవతి గారి జ్ఞాపకార్థం శ్రీ మైలవరపు శ్రీనివాసుగారు ఆర్థిక సహాయాన్ని అందించారు.
7) 24-5-2021న Live together అనాధ బాలికల ఆశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. బాలికలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మ నామ సంకీర్తన, పూజాదికములలో పాల్గొన్నారు. మహానివేదన, మంగళ హారతి అనంతరం అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆశ్రమవాసులందరికీ ఆదరంగా అందించారు. శ్రీ బి.జె.కె.శాస్త్రి, శ్రీమతి బివియస్ లక్ష్మి దంపతులు తాము 62 ఏళ్ళు అన్యోన్య దాంపత్యజీవితం పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ఈసేవాకార్యక్రమానికి అర్థిక సహాయాన్ని అందించారు.