అన్నదాతా సుఖీభవ!
అనసూయా మాతా విజయీ భవ !!
1) 3-4-2021 న Sadhana Institute మానసిక వికలాంగుల సంస్థలో ప్రేమార్చన నిర్వహించారు. సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి సురేఖ కడు భక్తిశ్రద్ధలతో అమ్మ అర్చనాదికములు నిర్వహించి ఆశ్రమవాసులందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని అందించారు. శ్రీ బి.వి. రామశాస్త్రిగారు తమ మనుమరాలు చిరంజీవి ఎమ్. శ్రీ పూర్ణ USA (శ్రీ ఎమ్. సత్యనారాయణ, శ్రీమతి ఎమ్. శ్రీలక్ష్మి దంపతులు కుమార్తె) యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు.
2) 8-4-2021 న నల్లగండ్లలోని ‘శిశు మంగళ్’ అనాధ బాలబాలికల ఆశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమంలోని 30 మంది చిన్నారులు భక్తిశ్రద్దలతో అమ్మపూజలో పాల్గొన్నారు. అనంతరం వారందరికీ అమ్మ (అన్న) ప్రసాదం, పళ్ళు అందించారు. శ్రీ తంగిరాల రామ్మోహనరావు, శ్రీమతి సుబ్బలక్ష్మి దంపతులు తమ మనవడు చిరంజీవి కరణ్ (శ్రీ తంగిరాల విజయకుమార్, శ్రీమతి రాధిక దంపతులు కుమారుడు) జన్మదిన శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు.
3) 23-4-2021 న Live Together Foundation అనాధ బాలికల ఆశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. అమ్మ అర్చనాదికములు నామ సంకీర్తన అనంతరము చిన్నారులకు అమ్మ (అన్న) ప్రసాదాన్ని అందించారు. అంతేకాదు ఆ బాలబాలికలకు అవసరమైన వైద్యపరీక్షలు కూడా నిర్వహించారు.
19-4-2021 శ్రీ కొండముది హనుమంతరావు, శ్రీమతి భానుమతి దంపతులు వివాహ షష్టిపూర్తి శుభసందర్భం. కాగా తమ జీవితము, జీవనము ‘అమ్మ’ ఆశీర్వచనమే అని విశ్వసించి వారు ఆ సందర్భాన్ని 23-4-2021 ‘అమ్మ’ జన్మదినోత్సవం నాడు ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించి జరుపుకున్నారు.
4) 23-4-2021 న నాగోల్ లోని ‘నిర్వాణ ఫౌండేషన్’ Day Care Center లో ప్రేమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా పేదవృద్ధులకు వస్త్ర, అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అన్న వస్త్రాలనిచ్చి ఆదుకోవడం అంటే ‘అమ్మ’కి ఎంతో ప్రీతిపాత్రమైనది. స్వర్గీయ శ్రీ అద్దేపల్లి సూర్య ప్రకాశరావుగారి సంవత్సరీకాల్ని పురస్కరించుకుని వారి ధర్మపత్ని శ్రీమతి సత్యవతిగారు మరియు వారి కుటుంబ సభ్యులు ఈ సేవాకార్యక్రమానికి ఆర్ధిక సహాయాన్ని అందించారు.
5) 27-4-2021 న మేడిపల్లిలో “మాతృ అభయ అనాధ బాలబాలికల ఆశ్రమం’లో ప్రేమార్చన నిర్వహించారు. ఆశ్రమంలోని 50 మంది బాల బాలికలు అమ్మ పూజాదికాల్లో పాల్గొన్నారు, అమ్మ నామ సంకీర్తన చేశారు; అనంతరం అమ్మ (అన్న) ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సేవాకార్యక్రమానికి సోదరి శిష్టా శాంత తమ తండ్రి స్వర్గీయ శిష్ట్లా సుబ్బారావుగారి పుణ్యతిథి (చైత్ర బహుళ పాడ్యమి) ని పురస్కరించుకుని ఆర్థిక సహాయం అందించారు.