అన్నదాతా సుఖీభవ!
అనసూయ మాతా విజయీభవ!!
3-3-2021: ఉప్పల్ లోని Live together Foundation (అనాథ విద్యార్థినుల ఆశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించబడింది. డాక్టర్ తంగిరాల సింహాద్రి శాస్త్రి, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు తమ మనవరాలు కుమారి రితిక జన్మదిన సందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అమ్మ పూజాదికముల నిర్వహణానంతరము అందరికీ ఆదరంగా అమ్మ (అన్న) ప్రసాదాన్ని అందించారు.
4-3-2021: నాగోల్లోని ‘వాత్సల్యం’ (అనాధ విద్యార్థుల) ఆశ్రమంలో ప్రేమార్చన నిర్వహించారు. డాక్టర్ తంగిరాల సింహాద్రిశాస్త్రి, శ్రీమతి విజయలక్ష్మి దంపతులు తమ కుమార్తె శ్రీమతి తంగిరాల అనసూయ జన్మదిన శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆశ్రమవాసులందరికీ అమ్మ (అన్న) ప్రసాదాన్ని పంచారు.
11-3-2021: శివరాత్రి పర్వదినాన సరూర్ నగర్ లోని మైత్రేయి ఫౌండేషన్ (పేద వృద్ధుల డేకేర్ సెంటర్) లో ప్రేమార్చన నిర్వహించారు. శ్రీ తుమ్మల తులసీచరణ్ (USA) గారు వారి అమ్మమ్మ గారు కీ.శే. శ్రీమతి ఆలపాటి స్వరాజ్యం గారి స్మృత్యర్థం ఆశ్రమవాసులకు అమ్మ (అన్న) ప్రసాదవితరణ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆశ్రమవాసులంతా అమ్మకి పూజాదికములు నిర్వర్తించి ప్రసాదాన్ని స్వీకరించారు.
28-3-2021 న తిరుమలనగర్లోని సహారా ఛారిటబుల్ ట్రస్ట్లో ప్రేమార్చన నిర్వహించబడింది. పేద విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, పళ్ళు, ఆహార పదార్థాలు పంపిణీ చేసి ఆదుకునే సేవా కార్యక్రమం ఇది. శ్రీమతి తంగిరాల విజయలక్ష్మిగారు తమ భర్త డాక్టర్ తంగిరాల సింహాద్రి శాస్త్రిగారి జన్మదిన శుభ సందర్భముగా ఈ ప్రేమార్చనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. నిర్వాహకులు, దాతలు, గ్రహీతలు అందరిపై ‘అమ్మ’ శుభాశీస్సులు సదా వర్షించుగాక!