అన్నదాతా సుఖీభవ! అనసూయ మాతా జయీభవ!
నవంబరు నెలలో
1) 12-11-2020న ‘Sadhana Institute’ (శారీరక, మానసిక వికలాంగులు మరియు వృద్ధుల ఆశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించారు. అమ్మకు అర్చనాదికములు నిర్వహించి అమ్మ(అన్న) ప్రసాదాన్ని పంచారు. శ్రీ బి.వి.రామశాస్త్రిగారి సతీమణి శ్రీమతి ఉమగారు తమ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
2) 13.11.2020న ‘అనురాగనిలయం’ (వృద్ధాశ్రమం)లో ప్రేమార్చన నిర్వహించారు. అమ్మకు పూజాదికములను నిర్వహించి అమ్మ (అన్న) ప్రసాదాన్ని పంచారు. శ్రీ జి.ఫణికుమార్ పుట్టినరోజు శుభ సందర్భంగా వారి జననీజనకులు శ్రీ జి.సత్యనారాయణమూర్తి, శ్రీమతి కామేశ్వరిగారలు ఈ సేవా కార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
డిసెంబరు నెలలో
1) 6-12-2020న నారాయణగూడ లోని ‘అనురాగనిలయం’ (వృద్ధాశ్రమం)లో శ్రీ హైమవతీదేవి జన్మదినోత్సవ సందర్భంగా ప్రేమార్చన నిర్వహించారు. శ్రీ బి.వి.రామశాస్త్రిగారు, శ్రీమతి ఉమ దంపతులు ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. హైమవతీదేవి చిత్రపటం, లలితా సహస్రనామ స్తోత్ర ఆడియోలను శ్రీ వియస్‌ఆర్ ప్రసాదరావు గారు ఆశ్రమమునకు అందించారు. పూజాదికముల అనంతరం అమ్మ (అన్న) ప్రసాదాన్ని పంచారు.
2) 7-12-2020 న ‘అనురాగనిలయం’ (వృద్ధాశ్రమం) లో ప్రేమార్చన నిర్వహించారు. శ్రీ ఎమ్.సత్యనారాయణ (USA) గారి పుట్టినరోజు శుభసందర్భాన్ని పురస్కరించుకుని వారి అత్తమామలు శ్రీ బి.వి.రామశాస్తి మరియు శ్రీమతి ఉమగారలు ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అమ్మకు అర్చనాదికములను నిర్వహించి అన్నప్రసాదాన్ని అందించారు.
3) 20-12-2020న ‘నిర్వాణ ఫౌండేషన్’ వారి పేద వృద్ధుల మరియు పేద విద్యార్థుల డే-కేర్ సెంటర్ నాగోల్‌లో ప్రేమార్చన నిర్వహించారు. కుమారి సోమయాజుల అఖిల తన జన్మదినోత్సవ శుభసందర్భంగా ఈ సేవాకార్యక్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అమ్మకు అర్చనాదికములను నిర్వహించి అన్నప్రసాదాన్ని అందించారు.
4) 27-12-2020న సోదరులు శ్రీ పి.గిరిధర్‌కుమార్ గారి జన్మదిన శుభసందర్భంగా మోతీనగర్‌లో అమ్మకు అర్చనాదికములను నిర్వహించి, పేదలకు ‘అమ్మ’ అన్న ప్రసాదాన్ని అందించారు. సుమారు 80 మంది అన్నార్తులు తృప్తిగా ప్రసాదాల్ని స్వీకరించారు. అన్నదాతలంతా అమ్మకి వారసులే. శ్రీ గిరిధర్‌కుమార్‌గారిపై అమ్మ అమృతాశీస్సులు సదా వర్షించుగాక!
5) 28-12-2020న మాన్యసోదరులు శ్రీ వల్లూరు రామమూర్తిగారు 85 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా ‘అనురాగ నిలయం’ వృద్ధాశ్రమంలో ప్రేమార్చన నిర్వహించబడింది. అమ్మనామ సంకీర్తన పూజాదికముల అనంతరము ‘వస్త్రవితరణ’, ‘అమ్మ అన్నప్రసాదవితరణ’ సేవలను నిర్వహించారు. కూడు, గుడ్డవంటి మౌలిక అవసరాల్ని తీర్చటం అక్షరాలా అమ్మ సేవే. రామమూర్తిగారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములతో సామాజిక సేవా రూపంగా అమ్మ నర్చిస్తూ అమ్మ శుభాశీస్సులను పొందెదరుగాక!