(1) చిక్కడ్ పల్లి, బాగ్ లింగంపల్లి, ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్, గాంధీ హాస్పిటల్ దగ్గర, సికింద్రాబాదు స్టేషను సమీపములోని ఉప్పల్ బస్ స్టాండు (బ్లూ సీ హోటల్ దగ్గర) ఉన్న పేదలకు రగ్గులు కప్పి సేవించిరి.
ఈ సేవా కార్యక్రమమునకై ఆర్థిక వనరులు సమకూర్చినవారు.
(2) శ్రీ కొండముది హనుమంతరావు, (2) శ్రీ బి.వెంకటరామ శాస్త్రి, శ్రీమతి ఉమ దంపతులు,
(3)శ్రీ తంగిరాల సింహాద్రి శాస్త్రి, శ్రీమతి విజయ దంపతులు, (4) శ్రీమతి ఎమ్. అనసూయ(వారి కుమార్తె శ్రీమతి రాధాహనుమంతరావు చిత్తాప్రగడ గారి ద్వారా), శ్రీ మేళ్ళచెరువు శాయిబాబా, శ్రీమతి లక్ష్మి దంపతులు, శ్రీ కందుకూరి జయకృష్ణ, శ్రీమతి ఓలేటి మాధవి, కిరణ్ మరియు శ్రీ ఎం.కె. రాజజోపాల్ శ్రీ తంగిరాల రామమోహన్, శ్రీ కృష్ణ మోహన్ లక్కరాజు గారు.
వీరికీ, కుటుంబ సభ్యులకూ ప్రేమరూపిణి అమ్మను సర్వ శుభములూ కలుగ చేయాలని ప్రార్థిస్తున్నాము.
ఈ సేవాకార్యక్రమ నిర్వహణలో శ్రీవఝ ప్రసాదరావు, శ్రీ కె. నరసింహ, శ్రీ బి.వి.ఆర్.శాస్త్రి, వారి డ్రైవరు పాలు పంచుకొన్నారు.
దుప్పట్లు ఇచ్చే సమయంలో ‘ఇది జిల్లెళ్ళమూడి అమ్మవారి ప్రసాదం’ అని చెప్పి ఈయబడింది.
“బాధితుల యెడ కలిగే కరుణారస హృదయ స్పందనమే దైవత్వం” అన్నది అమ్మ. “ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న” – అన్నది Mother Teresa.