1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జిల్లెళ్ళమూడి పోదాం రండి

జిల్లెళ్ళమూడి పోదాం రండి

Pogula Srinivasarao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : April
Issue Number : 9
Year : 2013
  1. జిల్లెళ్ళమూడి ఆట

 జీవనాడి కేంద్రమట 

అందరి అచటేనట

.అందరమ్మ నివాసమట.

 

  1. అనసూయ నామమట 

ప్రేమ సజీవరూపమట

 పట్టు పుట్టపు తల్లియట

 పుట్టదేవుని వల్లి యట

 

  1. భృకుటి అరుణబింబమట

 భృంగారపు బులాకియట

 కరముల సిరిగాజులట 

శిరసున విరిజాజులట

 

  1. అలతి అలతి వాక్యాలట

 అంతరంగ లేఖ్యాలట 

సిద్ధయోగ దృష్టియట

 సహజ కరుణ వృష్టియట

 

  1. సామాన్య గృహిణియట 

అసామాన్య గుణమణియట

 సుజ్ఞాన వర్షిణియట

సేవాతత్త్వహర్షిణియట

 

6.కలివెలసిన అపర్ణయట

 ఆకలి లేని పరిపూర్ణట

 అమ్మలందరి అమ్మట

 చాలచాల పెద్దమ్మట

 

  1. ఆలయాల సంగమమట 

ఆధ్యాత్మిక సింగమట

 నడయాడే దేవతట 

నడత దిద్దు శ్రీమాతట.

 

8.అన్నపూర్ణ సదనమట

 పంక్తి భోజనశాలయట

 భ్రాతృత్వపు దీవనట

 మాతృత్వపు దీవనట.

 

  1. మమతల రసధ్వనులట

 సమతల స్వరధునియట

 నూత్న భాష్య కారిణియట

 భవవిదూరతరణియట.

 

  1. డ్రస్సు అసలు చూడరట 

అడ్రససలు అడుగరట

 ఆకలొకటె అర్హతట 

అన్నార్తుల నెలవట.

 

  1. నిగమార్ధనిధియట 

నిరుపమానసన్నిధియట

 విశ్వజనని కోవెలట

 విశ్వశాంతి కోయిలట.

 

  1. జిల్లెళ్ళమూడి పోదాం రండి !

 అందరమ్మను చూదాం రండి !

 అమ్మ కరుణ మునుగుదాం ! 

ఆత్మోద్ధరణ పొందుదాం!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!