1. Home
  2. Articles
  3. Viswajanani
  4. జీవదాత్రి

జీవదాత్రి

J B Tirumalacharya
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 14
Month : August
Issue Number : 1
Year : 2014

తృప్తిగాను తినుము తృణమైన పణమైన

పిదప పరులకిమ్ము ప్రీతి ననుచు

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

ఆదరంబు తోడ అన్నంబు పెట్టిన

నీకు ముక్తి కలదు నిక్కమిదని

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరులన్న పలుకు తేనె చినుకు

 

బాధలెన్నొ కూడి బరువైన గుండెతో

చేరినట్టి వారి చింత తీర్చి

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

తేనెలూరునట్టి తెలుగు భాషను పెంచి

భవ్యమైన దేవభాష సాకి

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

మాటలాడు వేళ మణుల, మాణిక్యాల

మాటలెన్నొ చెప్పి మాయ విప్పి

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

తల్లి ఆశయమ్ము ధన్య “మాతృశ్రీ ”గ

బుధుల బుద్ధియందు పుట్ట చేసి

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

“విశ్వజనని” గాను విజ్ఞానరాశియై

నేల మేలుకోరి నెలను నెలను

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

రోగ రహితమైన రోజులుండాలని

హోమియోను నడిపి హామి పంచి

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

 

హాయి నచ్చు వైద్యమల్లోపతి అనుచు

పడకలారు కూర్చి భాగ్యమిచ్చి

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

మొక్క విలువ తెలిసి పెక్కు ముక్కల పెంచి

“టెర్రి” తోట చూపి ఠీవిగాను

జీవములను పోసె జిల్లెళ్ళమూడమ్మ

తిరుమలన్న పలుకు తేనె చినుకు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!