నిను మరువలేము నీ
నెచ్చెలులమే మేము
మరల ఒకసారి మాకై
తరలి రా హైమమ్మా
మా మొరలు వినవమ్మా!
ఎన్ని నాళులుగానో
ఎదురు చూచుచు నుంటి మమ్మా!
చూచి చూచి మా కన్నులు
వేసారి పోయె నమ్మా!
తనివితీరగ నిన్నొక్క మారు
కాంచగాలేక మేమెటు తాళ గల మమ్మా!
దయగల తల్లివి కాదా!
దరిశన మీయగ రాదా!
చిరు మువ్వల సవ్వడితో
ముచ్చటైన అందెలతో
పారాణి పాదాలు కదలగా
కలహంస నడకలతో
కదలి రా హైమమ్మా!
మా కలత తీర్చ రావమ్మా!