ఎంత గొప్పదానవె జిల్లెళ్ళమూడీ ! ॥ఎంత
ఏమి భాగ్యమె నీది జిల్లెళ్ళమూడీ !
‘నేను నేనైన నేను’ అని ప్రకటించిన తల్లికి
‘అంతా నా బిడ్డలన్న తల్లి అపరంజికి
తల్లివైనావె ఓ పెద్ద ముత్తైదువా || ఎంత||
ఆకులలొ అన్నాలు వడ్డించి వడ్డించి
బతుకులు పండించు అన్నాల తల్లికి
ఆలోచన కన్న ఆచరణ ముఖ్యమని
ఆచార్యిణిగ చెప్పు అనసూయ తల్లికి
యోగినీ, యోగ్యదా, యోగ్యగాయత్రికి.
నన్ను నా తల్లికి పెంపుడిచ్చిన తల్లికి
తల్లివైనావె ఓ పెద్ద ముత్తెదువా
చేతులె మనవంటు చేతలు కావంటు
చేయూత నిచ్చిన చెలువంపు తల్లికి
నీతిగా బతుకుటె నిజమైన జన్మంటు
నిగ్గు దేల్చిన యట్టి నిగమాల తల్లికి
ఆవరణ ఆదరణ నిలపవలెనంటూ
తృప్తి గా తిని పరులకింత పెట్టండంటు
ప్రవచించు తల్లికి తల్లివైనావే ॥ఎంత॥
ఏమిచ్చి మొక్కా జిల్లెళ్ళమూడి
ఏ నక్క తోకను త్రొక్కావో
లక్కు లక్కంటేను నీదీలె నీవేలె
తన పేరునే దాచి నీ పేరుపై పూచి
విశ్వాస జననివై లోకాల వెలిగేవు ॥ఎంత॥