మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 29-05 – 2022 నుండి 04-06-2022 వరకు BAOL (తెలుగు)
తృతీయ సంవత్సరం పూర్తిచేసిన విద్యార్థులకు తెలుగు భాషా పండిత శిక్షణ తరగతులు జరిగాయి. ఈ శిక్షణ తరగతుల్లో పూర్వ విద్యార్థి సమితి సభ్యులు విద్యార్థులకు LPCET కి సంబంధించిన పుస్తకాలను అందజేశారు. ఈ శిక్షణ తరగతుల్లో ప్రత్యేక శిక్షకులుగా MOC పూర్వ విద్యార్థి Ch. పెదలక్ష్మయ్యగారు, గణిత అధ్యాపకురాలు శ్రీమతి R. కుమారి వాణీ పద్మజ గారు, తెలుగు అధ్యాపకులు శ్రీ బందా శక్తిధర్ గారు విచ్చేసి విద్యార్థులకు శిక్షణనిచ్చారు. అలాగే కళాశాల తెలుగు విభాగానికి చెందిన అధ్యాపక బృందం డాక్టర్ L. మృదుల, శ్రీ IVS శాస్త్రి, కుమారి A.మనీషా, శ్రీ K. వెంకటేష్ విద్యార్థులకు శిక్షకులుగా కార్యనిర్వహణ చేశారు. తిమ్మసముద్రం నుండి ఐదుగురు విద్యార్థులు శిక్షణ పొందడానికి వచ్చారు. ఈ కార్యక్రమం ముగింపు సభకు శ్రీ M. దినకర్ అన్నయ్య గారు, శ్రీ లాల అన్నయ్య గారు విచ్చేసి ప్రత్యేక శిక్షకులుగా వచ్చిన శ్రీ బందా శక్తిధర్ గారిని సత్కరించి, శిక్షకులను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి శిక్షణ పొందిన విద్యార్థులకు శభాకాంక్షలు తెలియజేశారు. సభా నిర్వహణ చేసిన కళాశాల ప్రిన్సిపాల్ శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను అభినందించి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కళాశాల కరస్పాండెంట్ గారు డా.సుగుణ గారు రూపొందించగా, కళాశాల ప్రిన్సిపాల్ వరప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగింది.