అమ్మను చాలా మంది (ఆధ్యాత్మికసాధన) ఏమిచెయ్యమన్నారు ?” అని అడుగు తూంటారు. అమ్మ తరుచు ఏదైనా మంచిదే’ అని జవాబిస్తారు. ఒకనాడెప్పుడో ‘తోచిందేదో’ చెయ్యి; తోపింప జేసేది వాడేగా అన్నారుట. ఏదైనా మంచిదే’ అన్న పైమాటకి కొదవ ఈ పూర్తి వాక్యంలో వచ్చేసింది నాకు.
ఈ బోధ నిండుగా వున్నదంటాను. ఏది చెయ్యడము మంచిదో ఆలోచించి నిర్ణయించ ప్రయత్నించే వారికి ఆ సందిగ్ధతే నిలుస్తుంది. ఏ ఆచరణా కుదురుకోదు, కనక మీరు చెయ్యవలసినది ఏది మంచిదీ అన్న ఆలోచన కాదు, ఆచరణ మట్టుకే; ఇక ఆచరణ అన్నది. ఏది చేసినా మంచిదే అంటున్నారు అమ్మ..
ఒక్కొక్క మార్గంవారు ఒక్కొక్కటి చెయ్యమని చెప్తారు. ఒక్కొక్క మతానికి గ్రంథాలు ఎన్నైనా వున్నాయి. అవన్నీ ఇది చెయ్యమనీ ఇలాగ చెయ్యమనీ చెపుతాయి, మనము అవి చెప్పినవానిలోని మంచి చెడ్డలో, సౌకర్య అసౌకర్యాలో, నెమరువేసుకుంటూంటే ఏండ్లూ పూండ్లూ గడిచి పోతాయికాని పనిసాగదు. భక్తి, కర్మ, జ్ఞానము, యోగము అన్నవానిలో ఏది అనుకూలము, ఏది సులువు అని లాభనష్టాలు బేరీజువేసేవాళ్లు వాచాశూరులు గానే నిల్చిపోతారు. వీరిలో గడుసువారు. ఈతర్జనభర్జన గూడా సాధనే… విచార మార్గము అంటారు. ‘మార్గము’ అన్నది పడినడిచే దారిగాని వాదమూ ఉపన్యాసమూకాదు. చేసే ఆలోచనతోపాటు నడతకూడా వున్నపుడే విచారము’ మార్గము అవుతుంది. అన్ని మార్గాల్నీ విచారించడముకాదు విచార మార్గము; మరి ‘నేనెవరు’ అని విచారించడము.
వాదమూ, ఆలోచనా ఎంతచేసినా ఊహరంగములోనే కాని జీవన రంగములోనికి దిగరు. కాన్పులు చేసే డాక్టరు స్త్రీ శరీర నిర్మాణమును పుస్తకాలలోనే కాక, ఆపరేషన్లూ కాన్పులూ చేసేటప్పుడు ఎన్ని మారులైనా చూస్తాడు. అయితే జీవనము చేస్తున్నప్పుడు స్త్రీని చూచి విచారము పొందకుండా ఉంటాడా ? కనక తెలుసుకున్న తర్వాత ఏదో ప్రారంభించి చేద్దాము అనుకోవడము విజ్ఞానాహంకారానికి దోహదమే అవుతుందిగాని కార్యాచరణకి ప్రారంభముకాదు, తెలియకుండా ఏమిటీ చెయ్యడం ? చీకటిలో తడుముకోడమా ? అంటారేమో, ఆధ్యాత్మికసాధన భగవంతుణ్ణి నమ్మి చెయ్యవలసి నట్టిదే, ఇంద్రియాలవల్ల సమకూరే విజ్ఞానమూ, ఆలోచనా భగవంతుణ్ని పట్టలేవు. ఎవరికివారు, వారి అనుభవాలనుబట్టి నమ్మవలసినదేకాని ఒకరికి ఇంకొకరు భగవంతుడిట్టివాడు’ అని నిరూపించలేరు. సాధన మార్గాలు భగవంతుణ్ని నమ్మి అనుసరించ వలసినదేగాని కసరత్తు వంటివి కావు. నమ్మక పోయినా వానిపని అవి చేస్తాయి. కనక, ఆ మార్గమా, ఈ మార్గమా అని చేసే ఆలోచన దండుగ. (నీ నమ్మకాన్నిబట్టి మంచిమార్గమని ‘నీకు తోచినదేదో చెయ్యి’ అంటున్నారు అమ్మ. అప్పుడు నీవు నమ్మిన భగవంతునికి ప్రీతికరమయినదనో, ఆయన నిదర్శనము నీకు కలిగించేదనో నీవు నమ్మిన మార్గాన్ని అనుసరించిన వాడవౌతావు. భగవంతునికి నీ మనశ్శుద్ధి తెలుసును కదా ? నీవు వేసిన ప్రతి అడుగూ ఆయన వైపుదే అవుతుంది.
గురు, స్నేహితుడో, పుస్తకమో చెప్పినదైతే మాత్రము నచ్చినదైతే చెయ్యరాదా? అంటారేమో. ఏది మాత్రం ఒకరు చెప్పకుండా తెలుస్తుందీ మనకు ? మాటలు అమ్మ, నడక బందుకో, ఆటలు ఇతరులూ నేర్పినవేకదా? అలాగ వినీ చూచీ చదివి నేర్చిన దానిలో, నీకు దోచిన దేదో చెయ్యి’ నీకు బాగా నమ్మకము లేనిది వారు చెప్పేరనీ ఈ పుస్తకము చెప్పిందనీ ప్రారంభించి ప్రయోజనము లేదు: ప్రారంభించినా మానేస్తావు కొన్నాళ్ళకు. మంత్రోపదేశాలు పొంది నియమాలు పాటించలేక మానేసినవారూ, దారితప్పేమని బాధపడేవారూ. ఏంచేసినట్టు? సచ్చినదే అయితే, అంటే నీకు తోచినదే అయితే, త్రికరణ శుద్ధితో చేస్తావు. నారదుడు త్రిలోక సంచారి అంటారుగదా? ఎంతమంది ప్రభువులను చూచాడూ ఆయన ? ఒక ప్రహ్లాదునికి, ఒక ద్రువునికి, ఒక వాల్మీకికి చెప్పినది ప్రత్యేక అభిమనాముతో చెప్పేడా ? మరి ఆ ప్రభువులందరూ అలాటి దివ్య భక్తుని ఉపదేశాలు ఉపయోగించుకోలేదేమి ? వారికి అప్పటికి నచ్చక, పట్టక, లీలాశుకునికి సోమగిరి చెప్పినది పట్టింది. “శిబిపింఛమౌళి” ని గుర్తించి, నారదుణ్ణి దాటి వెళ్ళిపోయాడు. కనుక, నీకు తోచిన దేదో చెయ్యి’ నీకు తోచని దానిలో నీవు సాగలేవు. నీకు తోచిన దారిలోనైతే సాగుతావు. కౌశికుడు తలిదండ్రుల నసడ్డచేసి తపస్సు ప్రారంభించాడు. కొంగని చంపేడు. ఆయమ్మె వరో …. మన అమ్మ’ చేసి చూపించని దారిలో సాగినామె … ఆమె చెపితే. ధర్మ వ్యాధుణ్ణి చూచాడు. బుఱ్ఱ మళ్ళింది. దారిలో పడ్డాడు. కౌశికుడు తోచినదే చేశాడు అని గుర్తించు కొనండి.
ఇక రెండోభాగము ‘తోపింపజేసేది వాడేగా ?’ అన్న దానికి వద్దాము. లోకములో అన్నిటికీ ప్రేరణ భగవంతుడిదే’ అని అమ్మ అనడము విని ఉంటారు మీరు. నడక కనబడుతుంది. ప్రేరణ కనబడదు. కాని ప్రేరణ వాడిదే. “ఏ సాధన నైనా చెయ్యాలని తోపింప జేసేది వాడేగదా, మరి సందేహమెందుకు” అంటున్నారు అమ్మ. తోచినదేదో చేసేయడమేనా ? అని జంకు అక్కరలేదు. యత్నాల కన్నీటికీ ప్రేరణ వాడే గదా ? అంటున్నారు. ‘తోచినదేదో చెయ్యి’ అంటే నీకు కావలసినదేదో చేసెయ్యమని’ కాదు, నీకు కర్తవ్యమని తోచినదేదో చెయ్యమని. అలాగా తోపింపజేసేవాడు నాడే. ఆ పని నీకు తోచినదన్న కారణముచేత తక్కువైనదేమీ కాదు. దాన్ని చెయ్యమని తోపింప జేసినవాడు సర్వ కార్యాలకూ ప్రేరణ చేసే పరమేశ్వరుడే. వారెవరో చెప్పినది ఎక్కువనీ నీకు తోచినది తక్కువనీ ఏమీలేదూ, ప్రేరణ వానిదేకదా అని.
అయితేమరి ఎవరు చెప్పినదైతే మాత్రం తోచింపజేసేవాడు వాడే కదా ? మరి అది వద్దనడము ఎలాగ పొసగుతుందీ? అని అనవచ్చును మీరు. వద్దన్న మాటేలేదు. “తోచిన దేదో చెయ్యమనే అమ్మ అనేది. ఒకరు చెప్పినదేకానీ, నీకు తట్టినదేకాని కర్తవ్యమని ‘తోచినదేదో చెయ్యి’, అన్ని కార్యాలకు ప్రేరకుడు వాడే. పుస్తకాలు చదివీ, ఇతరులతో వాదించీ కర్తవ్య నిశ్చయము ఎవరూ చెయ్యలేదు.
– సేకరణ : మాతృశ్రీ 1966