1. Home
  2. Articles
  3. Viswajanani
  4. “తోచిందేదో చెయ్యి తోపించేవాడు వాడేగా”

“తోచిందేదో చెయ్యి తోపించేవాడు వాడేగా”

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : April
Issue Number : 9
Year : 2014

మేథమేటిక్స్. ఆల్జీబ్రాలో మనం సమీకరణములను చేసేటప్పుడు ఎదైతే మనకు తెలియదో దానిని అని అనుకొని సమీకరణ చేస్తాము. ఆ తో సమీకరణము చేసుకుంటూపోయి విలువను తరువాత తెలుసుకుంటాము. అట్లాగే ఆధ్యాత్మిక పరిభాషలో ఆనే ఇక్కడ అది. వాడు, బ్రహ్మ, ఆత్మ, తాను, నేను అని వ్యవహరిస్తారు.

మనుషులు అనేక భాషలు మాట్లాడతారు. వారి వారి భావాలను తమ తమ భాషలలో వ్యక్తీకరిస్తారు.ఆ వ్యక్తీకరించినప్పుడు ఎవరి ఎవరి భాషలలో వారివారి భావాలు తెలిపిన భావము ఒక్కటే. కుక్కలు, భౌభౌ అన్నా, పిల్లులు మ్యావ్ మ్యామ్ అన్నా, ఏనుగులు ఘీంకరించినా, పక్షులు కిలకిల రావాలు చేసినా, కాకులు కాకా అన్నా, చిలుకలు పలికినా, కీటకములు కీచ్ కీచ్ మని ధ్వని చేసినా తమ తమ భావాలను అవి పలికిన ధ్వనులలో వాటివాటి భావాలను ముఖ్యం. వారికి వచ్చిన భావాలను బట్టి వారి చేష్టలు పనులు వుంటవి. న్యూటన్ లా ఆఫ్ మోషన్ కనుగొన్న వారి భావాల సంపుటీకరణమే ఈ భావాలు వారి సొంతమే అయితే వారు ఇష్టమొచ్చినప్పుడు వాటిని కనుగొనగలరు. కనుక వారికి తెలియని మహాశక్తి ఒకటి ఆ భావాలను ఇస్తూవుంటుంది. తోపిస్తూ వుంటుంది లేకపోతే ఆ నిర్ణయమునకు కనుగొనేవారు. ఆ నిర్ణయాలు చేసినవాడు భావాలను ఇచ్చినవాడు తోపించినవాడు అదే, వాడే, బ్రహ్మ, ఆత్మే, తనే, నేనే అవుతుంది. అందుకే అమ్మ “తోచిందేదో చెయ్యి- తోపించేవాడు వాడేగా” అని అన్నది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!