1. Home
  2. Articles
  3. Mother of All
  4. దయ అంటే– నీవే నమ్మా!

దయ అంటే– నీవే నమ్మా!

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : July
Issue Number : 3
Year : 2019

ఆపద, కష్టం పొంచియున్నవని తెలిసిన మరుక్షణం ఉలిక్కిపడి దేవునికి మొక్కుకుంటాం; కొబ్బరికాయలు కొడతాం, ప్రదక్షిణాలు ఆచరిస్తాం, స్తోత్ర పారాయణ చేస్తాం.

1993 నుంచి 15 ఏళ్ళు DIET, Lecturer గా పనిచేశా. కాలేజీలో పాఠాలు చెప్పటమే కాకుండా పలురకాల Govt. duty చేయాలి. అలా జీతం కాకుండా ఇతరత్రా ఆదాయం ఉండేది.

ఆ సమయంలో నేను ఒక విచిత్రమైన లావాదేవీ, మొక్కు, Agreement అమ్మతో చేసుకున్నాను- పై రాబడిలో 10% అమ్మకి ఇస్తాను- అని. వెంటనే Account Book తెరిచా.

ఊహించని విధంగా వందలుతో ప్రారంభమైన ఆదాయం వేలు, లక్షలకు పెరిగింది.

Govt. Competitive Exams. Question Papers చేయటం, T.V. లో పాఠాలు చెప్పటం, Admissions – Exams Training programmes అదనపు బాధ్యతలు – అదనపు ఆదాయం.

రూ. 1000లకి రూ. 100/-లు; లక్షకి పదివేలు… అలా ముడుపుకట్టి కొన్నాళ్ళు. అమ్మకి పంపించా.

ఒకసారి 3 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది.

అమ్మో! నావల్లకాదనుకొని Agreement రద్దుచేసికొని, Account Book ని ఓంకార నదిలో నిమజ్జనం చేశా.

కాగా నాటికీ నేటికీ నేను మాటమీద నిలబడక పోయినా – అమ్మ – మాత్రం నన్ను వదల లేదు; దయామూర్తి కదా!

నాది వ్యాపారదృష్టి; conditional clause ఉంది నా Agreement లో.

 కానీ అమ్మ అకారణ కారుణ్య

August 2008 లో మా పెద్దమ్మాయి వివాహం చేశాను. డిసెంబర్ 2008 Retire అయ్యాను.

నవంబర్ 2010లో మా చిన్నమ్మాయి వివాహం నిశ్చయమైంది. నెల రోజులు వ్యవధి ఉంది. Retirement benefits Bank లో భద్రంగా ఉన్నాయని ధీమాగా ఉన్నాను. 

కానీ అమ్మ ప్రేమాతిశయం మమకారబంధం వేరొక విధంగా కలత చెందింది. – ‘నిలువ ఉన్న నాలుగు రాళ్ళు ఖర్చు చేస్తే వీడు ఏమి ఇబ్బంది పడాల్సి వస్తుందో – అని

కనుకనే ఒక Miracle చేసింది.

(Miracles are incidents that promote faith- Bernard Shaw)

నిశ్చయ తాంబూలాలు తీసుకున్న నాడు మా ప్రిన్సిపల్ ఫోన్ చేసి ‘పి ఆర్ సి వచ్చింది; అప్షన్ ఇవ్వండి’ అన్నారు. “నా మిత్రుడు ఒకరు ఆప్షన్ ఇస్తే 60 వేలు. నష్టం వస్తుందని విరమించుకున్నాడు”- అన్నాను. ‘ఆప్షన్ ఇవ్వండి; లాభం వస్తేనే చేస్తా’ – అన్నారాయన.

ఆప్షన్ ఇచ్చాను. 4 రోజులలో ఫోన్ చేసి రూ. 4 లక్షలు arrears వస్తుందన్నారు. ఆ తర్వాత 15 రోజులకి రూ. 4 లక్షలు Sanction అయి నా బ్యాంక్ ఎకౌంట్లోకి చేరింది.

“నేను గవర్న్మెంట్ కాదంటావా?” అన్నది అమ్మ ఒక సందర్భంలో. అమ్మ గవర్న్మెంట్ కనుకనే SANCTION చేసింది. ప్రతిఫలాపేక్ష ఎరుగని ప్రేమైక రస స్వరూపిణి అమ్మ హృదయ స్పందన అది!!!

అమ్మ (దైవాని)కి ధనం ఇవ్వాలి –

శ్రీశంకరభగవత్పాదులు వారన్నారు ‘జగన్మాతర్మాతః తవ చరణసేవా న రచితా

నవా దత్తం దేవి ద్రావిణమపి భూయస్తవమయా

తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే

 కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ||

దాని అర్థం: జగన్మాత మాతృ ధర్మాన్ని నిర్వర్తిస్తోంది; మానవులం సంతాన ధర్మాన్ని నిర్వర్తించాలి.

ఒక విశేషం : 1973 ప్రాంతంలో టీచర్గా పనిచేస్తున్నాను. నాడు నీ జీతం రూ. 324లు. వేసవి సెలవుల్లో జిల్లెళ్ళమూడిలో ఉన్నాను.

అందరింటి పై అంతస్థులో నున్న గదిలో అమ్మ ఉండేది. గ్రీష్మతాపం, వడగాలులు బాగా వీచి బాధించేది అమ్మనే. గుమ్మాలకు కిటికీలకు వట్టివేళ్ళ తడికలు కట్టి తరచు తడిపే వాళ్ళం; మంచి గంధం తీసి అమ్మ పాదాలకు పూసే వాళ్ళం.

ఒకనాడు అమ్మ

“నాన్నా! బాగా తల నెప్పిగా ఉందిరా. గట్టిగా ఒత్తు” అన్నది. రెండు చేతులతో అమ్మ తల పట్టుకుని కణతలు బాగా ఒత్తాను కొద్దిసేపు.

“హాయిగా ఉంది, నాన్నా!” అన్నది. అంతటితో ఆగలేదు. ఆ కొద్దిపాటి సేవ ఉపచారం చేసిందులకు

“నీకు ఎన్నివేలైనా ఇస్తానురా!” అన్నది.

నేను పరమానందభరితుడనై మనస్సులోనే “అమ్మా! వేలు ఇస్తానన్నావు చాలు. లక్షలు, కోట్లు అనవద్దు” – అని నమస్కరించుకున్నాను.

కారణం

ఐశ్వర్య మదాంధకారము జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అర్థం పరిమితివరకు ఉంటే అర్థం; మితిమీరితే అనర్ధం.

మరొక ముఖ్యాంశం :

1978 సం॥రం సంక్రాంతి పండుగకు జిల్లెళ్ళమూడిలో ఉన్నాను.

భోగిపండుగనాడు అమ్మ చకచకా నడుస్తూ దోసిళ్ళతో రేగుపళ్ళు, పూలు, నాణెముల మిశ్రమాన్ని బారులు తీరి కూర్చుని ఆశతో ఎదురు చూస్తూన్న బిడ్డలపై ఆశీః పూర్వకంగా చల్లుతున్నది. ఆ సమయంలో అమ్మ దరహాస చంద్రికలను వీక్షించి. తరించాల్సిందే.

నావంతు వచ్చింది. అమ్మనా తలపై పుష్పాభిషేకం- అమృతాభిషేచనం. అన్నట్లుగా పోసిన పుష్పపరంపరశ్రీ ఆనందాతిరేకాన్ని ఉల్లాసాన్ని పులకరింతను ధన్యతను కల్గించింది. వాస్తవంగా తన దివ్యాశీస్సుల్ని క్రుమ్మరించింది.

“నాన్నా! నీకు అన్నీ డబ్బులే” – అన్నది.

పండుగ తర్వాత ఇల్లు చేరుకునే సరికి రూ. 1800లు (5నెలల జీతం అంత) arrears నా కోసం వచ్చి వేచి ఉన్నది. 

వెంటనే, అమ్మ సూచన మేరకు, రూ.1,116లు కట్టి అన్నపూర్ణాలయ సభ్యత్వం తీసుకున్నాను.

జగజ్జనని అమ్మ సేవ చేస్తే ప్రతిఫలం కేవలం ధనం అనుకుంటే పొరపాటు. 

పరమేశ్వరి అమ్మ సేవ (ధన, వస్తు, సేవారూపంగా) చేసుకుంటే ప్రాప్తించే ఫలం ఏమిటో స్పష్టం చేస్తూ జగద్గురువులు శ్రీకృష్ణపరమాత్మ అన్నారు

‘తం విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా!

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్త్వ దర్శినః॥’ – అని. 

పరాత్పరి అమ్మ సేవ సర్వార్ధ దాయకం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!