జిల్లెళ్ళమూడి యాగశాలలో 30-9-22 నుండి 4-10-22 వరకు ఐదురోజులు దీక్షగా చండీ హెూమము నిర్వహింపబడినది. గణపతి పూజ, పుణ్యాహవాచనం, మంటపారాధన, షట్పాత్ర ప్రయోగ పూర్వకంగా దుర్గాసప్తశతిలోని మొదటి 13 అధ్యాయములు, అర్గళాస్తోత్రము, కీలకస్తోత్రము, దేవీ సూక్తం ఇత్యాది మంత్రస్తోత్ర పఠన పూర్వకంగా వివిధ హెూమ ద్రవ్యాలతో హవిస్సులు సమర్పిస్తూ శాస్త్రోక్తంగా చండీహెూమం నిర్వహింపబడింది.
ఇందు శ్రీయుతులు వి. ధర్మసూరి, ఎమ్.వి.ఆర్. సాయిబాబు, చక్కా శ్రీమన్నారాయణ, కె.యస్.యన్.మూర్తి, శ్రీమతి బూదరాజు వాణి మున్నగు స్థానికులు మరియు బాపట్ల, విశాఖపట్టణం వంటి పట్టణాలు, నగరాల నుండి విశేష సంఖ్యలో అమ్మ భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఎమ్. సందీప్ శర్మ, శ్రీ చుండి నవీన్ శర్మ మరియు ప్రత్యేక వేదపండితుల ఆధ్వర్యంలో హెూమాల్ని వైభవంగా నిర్వహించారు.
– S.V.J.P. TEMPLES TRUST