అలంకారము | శ్రీ అనసూయేశ్వరాలయంలో అమ్మను స్వయంగా అర్చించుకున్న సోదరీ సోదరులు |
శ్రీ అనసూయాదేవి | బ్రహ్మాండం రవీంద్రరావు దంపతులు, బ్రహ్మాండం వసుంధర, మన్నవ సుబ్బలక్ష్మి |
శ్రీ బాలా త్రిపురసుందరీదేవి | మల్లికార్జునరావు దంపతులు, సాయికుమార్ దంపతులు, అన్నె రమణవర్థని |
శ్రీ గాయత్రీదేవి | లక్ష్మణరావు దంపతులు. కె. విజయలక్ష్మి, వేదవిద్యార్థులు, ఎమ్. శారద, కె. సావిత్రి |
శ్రీ అన్నపూర్ణాదేవి | వై.వి.యల్.యన్.శర్మ దంపతులు, పి.వి. రమణారావు దంపతులు, మన్నవ నరసింహారావు మామయ్య, అత్తయ్య, అన్నపూర్ణాలయ సిబ్బంది. |
శ్రీ లలితా త్రిపురసుందరీదేవి | కె.యస్.యన్. మూర్తి దంపతులు, కె.జి.కె.ప్రసాద్ దంపతులు, తురుమెళ్ళ మురళీధర్ దంపతులు, ఎమ్. సందీప్ శర్మ దంపతులు |
శ్రీ మహాలక్ష్మీదేవి | చక్కా శ్రీమన్నారాయణ దంపతులు, ఎమ్.వి.ఆర్. సాయిబాబు దంపతులు, ఎల్. రామకోటేశ్వరరావు దంపతులు |
శ్రీ సరస్వతీదేవి | కె.నరసింహమూర్తి దంపతులు, బ్రహ్మాండం శేషు, వి. ధర్మసూరి కుటుంబ సభ్యులు |
శ్రీ దుర్గాదేవి | భట్టిప్రోలు రామచంద్ర దంపతులు, అన్నంరాజుసాయివెంకటేశ్వరరావు దంపతులు |
శ్రీ మహాకాళీదేవి | వఝప్రసాదరావు దంపతులు, వి.రమేష్ దంపతులు, ఐ. కృష్ణశర్మ దంపతులు |
శ్రీ రాజరాజేశ్వరీదేవి | వల్లూరి ప్రేమరాజు, సుజాతక్కయ్య |
అనుదినం సాయంసమయ పూజానంతరం దర్బారు సేవాకార్యక్రమం – భక్తి గీతాలాపన, దేవీస్తోత్ర గానం, వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్య ఇత్యాది ఆర్షవాఙ్మయ పఠనం, జగన్మాతకు నివేదనం – నిర్వహింపబడినది. అమ్మ శతజయంతి మహోత్సవ సంవత్సరం చాల పవిత్రమైనది, విశేషమైనది. ఈ కాలంలో ఆయా ఉత్సవాలలో స్వయంగా అమ్మను అర్చించుకోవటం పురాకృత పుణ్యఫలం, సకల శుభప్రదం. కావున అవకాశం ఉన్న సోదరీ సోదరులు ఈ కాలంలో ఎన్నాళ్ళు ఉండగలిగితే అన్ని నాళ్లు జిల్లెళ్ళమూడిలో ఉండి ఇచ్చటి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని అమ్మ శుభాశీస్సులు పొందగలందులకు సోదరీ సోదరులందరికీ ఇదే సాదర ఆహ్వానం.
S.V.J.P. Trusts, Jillellamudi