పి-పరమ
యస్-శాంత
ఆర్ – రూపం
పరమశాంతరూపం
పి.యస్.ఆర్ అన్నయ్య
మనసు నిండా అమ్మ తత్వం
నాలుక చివర సరస్వతీనాట్యం
వంటినిండా ఉరకలెత్తే ఉత్సాహం
వెరసి పి యస్ ఆర్ అన్నయ్య
ఎవరి ఇంట్లో ఏమి జరిగినా
అన్నయ్య మనసులో కవిత్వం
జాలువారుతుంది
అందరింటిలో ఉత్సవాలు జరిగినా
అంతటా ఆంజనేయమయం
చిన్నా పెద్దా భేదం లేదు
అందరితో స్నేహం కలుపు
ఆయన తీరు ముచ్చటగొలుపు
ఆయన నోట ఆప్యాయపు పిలుపు
దుర్భిణి ఆయన విశ్వజనని పత్రిక
అందు విషయం విశ్వజనని
నిరంతరం మనకు కలిగే సత్యదర్శనం
ఇంకేమి కావలె ఆయన ప్రతిభకు నిదర్శనం
అగ్రజులందరినీ ధన్యజీవులుగా
మన ముందు సజీవం చేసే
నేడు తానూ వారితో కలిసి
ధన్యజీవిగా మన మనసుల్లో
స్థిరస్థానం పొందె
అనసూయా వ్రతాలతో
ఇంటింటి సభ్యుడయ్యే
గేయపఠనాలతో
మనమనంబున
మాననేయుడాయ్యే
పురుషోత్తమ పుత్రభార్గవుడిగా
వినుతికెక్కే
అమ్మ చే “ఈ స్థానకవి “అని
ప్రకటించబడే
విలక్షణ ప్రయోక్తగా
జిల్లెళ్ళమూడిలో స్థిరపడిపోయే
పీఠాధిపతికి అనుజుడై
అన్నవెంట నడిచే
అమ్మకు పుత్రుడై
అగ్రజుడిగా మన్నే
సాహిత్యంతో అమ్మ సేవచేసే
ప్రణాళికలతో అందరింటి
అభివృద్ధికి అనుక్షణం తపించే
నిర్వాహకులతో మమేకమయ్యే
మృత్యు పరిష్వంగంలో ఉండి
మాత ఉత్సవాలకై మధనపడే
మాతకు మహదానందం కూర్చే
మమతలగర్భగుడికి మార్గమేర్పడే
సన్మార్గులందరికీ సన్మానములు చేసే
ఎవరు ఏ మార్గన నడవాలో బోధచేసే
సన్మానాలు బోధనలు సకాలంలో ముగించే
అమ్మ ప్రత్యక్ష సేవకై వేవేగజనియే
జీవితం సఫలమయ్యే
భువినుండి దివికిపయనమయ్యే
దివ్యచరణాలకు పారాణి అయ్యే
దివ్యాత్మలకు పౌరాణికుడయ్యే
మనందరికీ నిత్యస్మరణీయుడయ్యే