అమ్మ దివ్య చరితం
కారుణ్య సాగరం
అమ్మ దివ్య చరితం
అదే మోక్ష ధామం..!
పరం ధామం…! పావనమ్… !
పూజారిని అనుగ్రహించెను
రాజ్యలక్ష్మి రూపమై
చోరునకు చూపు నొసగెను
శ్రీ బాల రూపమై
ఉగ్గుపాలతో త్రాగెను
తల్లి ప్రేమ తత్వమును
పాల బుగ్గల బాల్యంలోనే
బ్రహ్మాండము నిండెను
అనాదియౌ ఈ సృష్టిని
నాదిగా వక్కాణించెను
ఆబాల గోపాలమై
అణువణువూ వ్యాపించెను
అమ్మ ప్రేమ అనంతము
భుక్తి ముక్తి దాయకమ్
అమ్మ నామ మంత్రము
సర్వ పాప హరణమ్!!