1. Home
  2. Articles
  3. Mother of All
  4. ధన్యచరిత శ్రీమతి చింతా వసంత

ధన్యచరిత శ్రీమతి చింతా వసంత

Various Authors
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 21
Month : January
Issue Number : 1
Year : 2022

“అమ్మను చూడటం వేరు, అమ్మను దర్శించటం వేరు” – అని అంటారు. మాన్య సో|| శ్రీ VSR మూర్తి గారు.

అమ్మను చూడటం అంటే అమ్మ అవతారకాలంలో ఉండి భౌతికంగా చూడటం. అమ్మను చూడటం నిస్సందేహంగా పుణ్యం, సాలోక్యం, సాయుజ్యం.

కాగా కొందరు ‘తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – అని పోతనగారు ప్రార్థించినట్లు ఏ పరదేవతను అష్టమాతృకలు నిరంతరం తమ తమ మనో మందిరాల్లో కొలుస్తూ ఉంటారో ఆ తల్లిగా ‘అమ్మ’ను ఎరిగి నిండు మనస్సుతో అర్చిస్తారు. ఆ కోవకు చెందిన అమ్మ బిడ్డ శ్రీమతి చింతా వసంత. 1999లో ప్రారంభమైన ‘Mother of All’ త్రైమాసిక సంచిక Typesetter గా ఆమె సుపరిచితురాలు.

మాన్య సోదరులు డా॥ టి. రాజగోపాలచారి, డా.టి.ఎస్. శాస్త్రి, శ్రీ సి. సింహాద్రి, శ్రీ డి.వి.ఎన్. కామరాజు మున్నగు వారికి చాల సన్నిహితురాలు. అమ్మ స్వీయచరిత్రను స్వయంగా చెప్పగా యథాతధంగా శ్రీ యార్లగడ్డ భాస్కరరావు అన్నయ్య గ్రంథస్థం చేశారు. మొన్నటి వరకు వెలుగు చూడని ఆ బృహద్గ్రందాన్ని (ఆధ్యాత్మిక సర్వస్వాన్ని) అకుంఠిత దీక్షతో దోష రహితంగా అందంగా ఒక తపస్సులా Type Setting చేసి రెండు సుదీర్ఘ సంపుటాలుగా అమ్మ బిడ్డలకు అందించిన సోదరి వసంత సేవలు అమోఘములు అమూల్యములు. అంతేకాదు, శ్రీ హైమవతీ నమశ్శతి’ వంటి గ్రంథాన్ని DTP చేశారు.

నాలుగు సంవత్సరాలుగా ఆమె అనారోగ్యంతో ఉన్నది; అయినా ఉపిరి ఉన్నవాళ్ళూ అమ్మ వాఙ్మయ సేవను మరువ లేదు. తేది 08-02-2022న హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచి అమ్మలో ఐక్యమైనది.

తొలి రోజుల్లో అమ్మ వద్దకు వచ్చే సోదరీ సోదరుల్లో ద్యోతితమయిన నిష్కల్మష ప్రేమాను రాగాలు ఈ అమ్మాయిలో ప్రతి ఫలించటం ఒక విశేషం – అమ్మ అనుగ్రహ సంకేతం.

చిన్న వయస్సులోనే అమ్మ సాయుజ్యానికి తరలిపోవటం తీరని లోటు. సోదరి శ్రీమతి చింతా వసంత కుటుంబానికి ‘Mother of All’ బృందం అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నది.

Sad news of the untimely demise of Smt. Chinta Vasantha comes as a shocking and depressing. We had a long association ever since the beginning of the publication of the Journal Mother of All in 1999, though she has been ailing for the past four years or so I always have been hoping that she would come back to her normal health. It is all the more sad that she is young and only 51 years of age. I spoke to her husband Mr. Rajkumar as well as her brother Mr. Vardhan as soon as I saw the posting in this group this morning. Words fail to express my grief over the sad news. My sincere prayers to Amma to bless her with everlasting peace in Her lap and courage and fortitude to the members of her family to face this calamity.

Dr. T.S. Sastry


Smt. Chinta Vasantha from Hyderabad, merged with Amma last Night. She extended yeomen service for “Mother of All” journal for the past more than two decades. She used to give top priority for journal work, taking care of every small aspect even during her ill health. She was deeply devoted to Amma.

Her departure is really a great loss. We pay tearful homage to her and pray to Amma to bestow eternal peace to her….

DV N Kamaraju


Very unfortunate and extremely sad to learn the news. Highly committed and devoted lady, May her soul merge in Amma.

Ganti Kaliprasad


అమ్మ జీవిత మహోదధి, శ్రీ హైమవతి నమశ్శతి వంటి ఎన్నో గ్రంథాల్ని శ్రద్ధా భక్తులతో దోషరహితంగా ఒక ఆరాధనగా DTP చేసి ‘అమ్మ’ను అర్చించుకున్న ధన్యచరిత శ్రీమతి వసంత.

A V R Subrahmanyam


చాలా విషాదకర వార్త! ‘Mother of All’ పత్రికకి అకుంఠిత దీక్షతో సేవ చేసిన మహనీయ వ్యక్తి శ్రీమతి వసంత!!

తంగిరాల రాము


మాటలు లేవు కన్నీళ్ళే తప్ప. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని కలిగించాలని ‘అమ్మ’ను వేడుకుంటూ 

శ్రీలక్ష్మి

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!