1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నాకిక జన్మ లేదన్న – గోవాడ వాసుదేవరావుగారు

నాకిక జన్మ లేదన్న – గోవాడ వాసుదేవరావుగారు

N Ramadevi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : May
Issue Number : 10
Year : 2013

మిట్టమధ్యాహ్నం 12 గంటల సమయం. 3 దశాబ్దాల నాటి విషయం. మండుటెండ. మా పెద్ద అన్నయ్యతో అమ్మ వద్దకు రావడం జరిగింది. అంతకు ఒక నెల దినాలకు ముందు మా అమ్మ జిల్లెళ్ళమూడి రావడం జరిగింది. తిరిగి వచ్చిన పిదప అదే వస్తుందిలే అని అమ్మగారు అన్నారని చెప్పడం జరిగింది. ఆ వెంటనే ఒక రోజు రాత్రి నిద్ర సమయంలో అమ్మ నా వెనుకగా వీపు మీద నుండి మెడచుట్టు చేయి వేసి ఒక పెద్ద పూలదండను నా మెడలో అలంకరించింది నాలో ఏదో శబ్దం. అమ్మా నేను అర్పణ ఐపోతాను అని అనడం లేక భావనో తెలీదు. ఇదీ అని వివరించడం కష్టం. ఆ తదుపరి ఒక వారం లోపలే – నేను నా జన్మభూమిని వీడి ఈ జన్మభూమికి రావడం- మాతృశ్రీ చరణారవిందయోః సర్వం సమర్పయామి – ఈ కళలన్నీ నావికాదు మహాప్రభో అమ్మగారే – తానే నేనై – నేనై తానై నీవు లేక లేను లేను – నీవు లేక నేను లేను – నేను లేక నువ్వులేవు – నువ్వులేక నేను లేను అని నాచేత అన్పించి, అలరించి, నవ్వించి కవ్వించి దేశభాషలందు తెలుగు లెస్స అనడానికి మారు జన్మభూమి నందు జిల్లెళ్ళమూడియే చరితార్థతను చేకూర్చుననే విశిష్టమైన, అద్వితీయమైన, ప్రాపంచిక జగత్తుకు సంబంధం లేనటువంటి, అద్వైత సిద్ధాంతానికి కట్టుబాటు చేసింది.

నేనేమిటి, ఈ కుగ్రామం ఏంటి – రావడం – పోవడం –  రచనలు సాగించడం – నా పేరొకటి ఈపత్రికలో వేయించడం – ఇదంతా నిజంగా నిజమేనా – అసలు అప్పటి నా ప్రపంచం – Dream girl హేమమాలిని, జయబాధురిది (అభిమాన్ సినిమా) చూసి వారికి Favourite నే ఐపోయాను. బాంబే డైయింగ్ డ్రెసెస్ Govt. women’s college లో చదువుల సంరంభం. ఈ చదువుల ఐపోగానే ఎపుడెపుడు జాబ్లో చేరదామనే ఉరకలేసే ఉత్సాహం. ఇక మరో ఘట్టం ఇది మరీ విచిత్రం.బాపట్లకు తెనాలి నుండి Direct bus అపుడే కొత్తగా వేశారు. అందులో అన్నయ్య నేను కూర్చొన్నాం. Bus standing లో ఎడమ ప్రక్కన పూలకొట్లముందు ఆగింది. అటు కుడివైపు రోడ్డున శ్రీమతి కాత్యాయని అక్కయ్య, అన్నంరాజు ఉష అక్కయ్య వస్తున్నారు. వారు ఎవరో అపుడు నాకేమి తెలీదు. వాళ్ళిద్దరూ. గోవాడ కరణం గారి అమ్మాయి వస్తుందని అంటున్నారు. ఆ మాట నాకు విన్పించింది. Right side వాళ్ళు. బస్ లో left side నేను ఎలా విన్పిస్తుంది. అప్పుడు నేనేమి ఆ విషయం పట్టించుకోలేదు. 3 దశాబ్దాల అనంతరం అప్పటి ఆ voice ఇప్పటికీ నా చెవుల్లో ring మంటున్నది. ఈ విధంగా వున్న అమ్మ చరిత్రకు ఏమి విశ్లేషిస్తాం చెప్పండి. సరే మీ యిష్టం మీది. శివుడు ముక్కంటివాడు. అమ్మ మాత్రం – 760 కోట్లనేత్రాల సమ్మేళనం. తస్మాత్ జాగ్రత్త – అన్నింటిలోని నేనును – నేనే కదా అన్నది.

ఇంకోపరి మా అక్కకు వివాహం నిశ్చయమై పోయింది. ఏదో కారణంగా వద్దను కొన్నారు. నేను మా చిన్నక్క లక్ష్మీపురంలో ఏదో రోడ్డు మీద దిగులుగా మాట్లాడు కొంటు వెళ్ళాం. ఆ రాత్రి నాకలలో. ఎందుకు మీకు తెలిసిన వాళ్ళే చుట్టాలే కుదురుతారులే అనే మాట విన్పించింది Next week. మా చుట్టాలే మా బావగారు. కాని ఒక విషయం అప్పటికి అమ్మ మాత్రం నాకేమీ తెలీదు. ఈ లాంటి సంభాషణలు జరిగే ప్రశక్తి అసలే లేదు. ఎందుకంటే అసలు మా చిన్నన్న చాలా Discipline.

మా అమ్మ కూడా మాతో ఏమి చెప్పేది కాదు. ఒత్తిడి పెట్టేది కాదు. ఆమె దొడ్డి దోవన ఒక జిలేబీ బుట్ట తీసుకొని (ఇంట్లో చేయించేది లెండి) అమ్మవద్దకు వచ్చి దొడ్డి దోవన ఇంట్లోకి జొరబడేది. ఈ లోపల నేను మా చిన్నక్క ఒక యుద్ధరంగం చేసేవాళ్ళం. ఎక్కడి కెళ్ళావే అని సతాయించే వాళ్ళం. ఆనాటి అమ్మ ఆగడాలు ఈనాడు మనకివే పూజ పుష్పాలు అయినాయి.

1) అమ్మరో కొమ్మరో అనసూయమ్మరో – దీనల బ్రోచేటి దేవతా వల్లిరో

2) అమ్మరో కొమ్మరో అనసూయమాతరో – రాక్షస సంహారిణీ గరళ కంఠుడురో

3) అమ్మరో కొమ్మరో అనసూయేశ్వరిరో – మా యింటి నేలేటి శ్రీ మహాలక్ష్మిరో

4) అమ్మరో కొమ్మరో – అనసూయాదేవిరో భూమిని పాలించే భూమాతరో

5) అమ్మరో కొమ్మరో -అనసూయాంబరో – కోర్కెలు తీర్చేటి కొంగుబంగారమురో

6) అమ్మరో కొమ్మరో – హేమానుసూయరో భువిని జన్మించిన భూలోకసుందరిరో

7) అమ్మరో కొమ్మరో – నాగేశ్వరానసూయరో – మనకొరకుగా నున్న బహుమంచి తల్లిరో

8) అమ్మరో కొమ్మరో శ్రీ లక్ష్మీనారాయణ – పార్వతీ పరమేశ్వరరూప పరబ్రహ్మమైనయట్టి – బ్రహ్మాండేశ్వరిరో…

ఈ స్త్రీమూర్తికి ఇదే నా ఆహ్వానం. గులాబీ, లిల్లీపూల సమ్మేళనంతో ముడివేసి అలరించిన గజమాల, వందనం, వందనం అభివందన విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

అదొక సంస్థానం. అనసూయమ్మ ఆ యింటి ఇల్లాలు. శ్రీ వాసుదేవమూర్తి గారు గోవాడ కరణంగా పేరు ప్రఖ్యాతులను ఆర్జించారు. నిరాడంబరులు. మంచి సాహితీవేత్త. ఆధ్యాత్మిక సంపన్నులు. వారికి సంతానం 5 గురు స్త్రీలు, 2 పురుషులు. వారందరు డాక్టర్లు, ఇంజనీర్లు ఎవరికిష్టమైన చదువును వారు ఎంచుకొని చదువుకొన్నారు. ఆ ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, పిండివంటలు ఒక వైపు వండేవారు, బియ్యం దంచేవారు మరొక వైపు, పప్పులు విసిరేవారు, కాఫీ పొడి మిషన్ వేసేవారు మరొకవైపు. వాసుదేవరావుగారు నిత్యం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకొనేవారు. శివభక్తులు.

నక్సలైట్లు పడితే వారు దోచుకోవడాని కొచ్చినట్లు తెలుస్తుంది. వాళ్ళను పట్టుకోవడానికి పోలీసు, సి.బి.ఐ. అదీ ఇదీ కాకపోతే ఏదో ఒక కమీషన్ వేస్తారు. మరి వీరి గృహంలో జరిగిన చోరీ అలాంటిది ఇలాంటిది కాదు సుమండీ – అజ్ఞాత శత్రువు భగవంతుడే దొంగగా ఐనాడు. రూపం, రుచి, వాసనలేని ఒక డ్రాపు పడితే విస్తరించి ఇంతింతై వటుడింతై అన్న రీతి విస్తరించింది. ఆ చుక్కే జీవనదివలె మారింది. దీని సారాంశమే ఆ పడిన ఒక్క డ్రాపుకు సమాధానం అయింది ఈ చిన్నారి చిలకమ్మ. ఆమె జీవన గమ్యం మారిపోయింది. మనస్సంతా ఒక రాధగా, రుక్మిణిగా, నీలాంబరి వలె ఏదో మరేదోగా ఐపొయినది. మోసం తెలీని ఆచిగురుటాకు చిన్నది భావి జీవితానికి ఒక ఆదర్శ గృహిణిగా మారింది. అందరింటి బంధువైంది. ఆ వేసినదేముడు రాజకీయ, సామాజిక, కమ్యూనిజం, లలితతత్త్వం, అంశాలతో కూడిన వాడైనందు వల్ల ఆ మగువ అక్కడే స్థిరపడి పోయి, వశమైపోయి, అలసి సొలసి ఆనందంతో సొమ్మ సిల్లింది. ఆ చిన్నదాని తండ్రికి నా బంగారు తల్లిని నేనే కన్నాననే ఆనందంతో నాకిక జన్మలేనే లేదంటూ కన్ను మూశారు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!