జిల్లెళ్లమూడి అనగానే అందరికీ వెంటనే స్ఫురించేది అక్కడ జరిగే నిరతాన్నప్రదాన కార్యక్రమం.
“ఎందరు రానీ, ఎప్పుడు గానీ, ముందుగ విందులు చేయును జనని” అని
పరవశుడై నదీరా గానం చేసినా, “అన్నమో రామచంద్రా! అను అరుపు కరువైనపురము
అవనిపై ఒక్కటే అది అర్కపురము”
అంటూ కవులు కీర్తించినా, నిజానికి అదే జిల్లెళ్లమూడిలోని అన్నపూర్ణాలయం ప్రత్యేకత. “జిల్లెళ్లమూడికి ఎవరైన ఆకలితో రావచ్చును గానీ, ఆకలితో వెళ్ళకూడదు” అనేది అమ్మ ప్రేమశాసనం.
ఈ నిరతాన్నప్రదాన కార్యక్రమంలో అణువణువునా ద్యోతకమవుతున్నది అమ్మ దివ్య మాతృప్రేమ. ఈ జగన్నాధ రధం అదృశ్య సారధి నిజానికి నాన్నగారు. పందొమ్మిదివందల నలభై దశకంలో నాన్నగారు కరణీకం నిమిత్తమై జిల్లెళ్లమూడిలో అమ్మతో సహా అడుగుపెట్టారు. ఆ తొలిరోజుల్లో అమ్మ దివ్యదీధితులు ప్రపంచానికి అంతగా వ్యాపించకపోయినా, పందొమ్మిది: వందల యాభయ్యవ దశకం వచ్చేసరికి అమ్మ దర్శనార్ధమై వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. ఆ రోజుల్లో అమ్మే స్వయంగా వచ్చిన వారికి అన్నం వండి వడ్డించేది. సామాన్య కుటుంబీకుడైనా, మేరునగధీరుడైన నాన్నగారు నిత్యం జరిగే ఆ ఖర్చుకు వెనుదీయక, వచ్చిన అతిథులను సాదరంగా ఆహ్వానించేవారు. అమ్మ వాత్సల్యామృత ధారలనాస్వాదించవచ్చే జన బాహుళ్యానికీ అమ్మకీ మధ్య ఒక సౌహార్దవారధిగా నిలిచారు.
శ్రీ నాన్నగారు ఆలయ ప్రవేశం చేసిన రోజు ఫిబ్రవరి 17. జిల్లెళ్ళమూడిలో శ్రీవిశ్వజననీ పరిషత్ అధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న జరిగే నాన్నగారి ఆరాధనోత్సవము ఆ మహోన్నత వ్యక్తిత్వానికి అసంఖ్యాక ప్రజలర్పించే కృతజ్ఞతా నివాళి. సర్వచరాచర సృష్టిని తన సంతానంగా భావించిన అమ్మ, నాన్న గార్లకు ఆ సంవత్సరం పండిన ధాన్యంతో అభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుతారు. ఈ కార్యక్రమానికి “ధాన్యాభిషేకం” అని పేరు పెట్టినా, నిజానికి అది అమ్మ బిడ్డలు అమ్మ, నాన్నగారలకు జరిపే “ప్రేమాభిషేకం”. ఇది ఒక వినూత్న, విభిన్న ఆధ్యాత్మిక కార్యక్రమం. ఆగమశాస్త్రం సూచించిన ఒక మధురమైన మలుపు.
ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ధాన్యపురాశిని ఆ సంవత్సరం పొడవునా అమ్మ, హైమ, నాన్నగార్ల దర్శనార్ధమై వచ్చే జన సందోహానికి,, ఎక్కడెక్కడినుంచో వచ్చి ఇక్కడే వుండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నిత్య భోజన ప్రసాదంగా అన్నపూర్ణాలయం ద్వారా వినియోగింపబడుతుంది.
ఈ పవిత్ర యజ్ఞంలో అందరూ పాలుపంచుకోవచ్చు. ఆ రోజు జరిగే ధాన్యాభిషేకం కార్యక్రమంలో తనివితీరా పాల్గొనవచ్చు. స్వయంగా ధాన్యం తేలేకపోయినవారు ఒక బస్తా ధాన్యం ఖరీదుగా రూ. 1500/ గానీ, ఒక బస్తా బియ్యం ఖరీదుగా రూ. 3000/- చెల్లిస్తే శ్రీవిశ్వజననీ పరిషత్ వారి తరఫున ఆ బాధ్యతను ఆనందంగా నెరవేరుస్తుంది. వారు ఆరోజు వచ్చి ధాన్యాభిషేకంలో పాల్గొనవచ్చు, లేనిచో వారికి పోస్టు ద్వారా ప్రసాదం అందజేయబడును.
శాశ్వత ధాన్యాభిషేక పధకంలో పాల్గొనదల్చిన వారు రూ 20,000/- విరాళము సమర్పించినచో వారి పేరున ప్రతి సంవత్సరము అభిషేకాదులు నిర్వహించి, ప్రసాదములు పంపబడును.
ఈ మహాయజ్ఞంలో అందరూ తలా ఒక చెయ్యి వేసి తమవంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా శ్రీవిశ్వజననీ పరిషత్ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, సాదరంగా ఆహ్వానిస్తున్నది.
విరాళములు పంపదలచుకున్న సోదర సోదరీమణులు నగదు రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ పంపగలరు. నగదు రూపేణ పంపగోరు వారు శ్రీ విశ్వజననీ పరిషత్ పేరు మీద బ్యాంకుడ్రాఫ్ట్/చెక్ లేదా మనియార్డర్ రూపేణా కానీ పంపవచ్చును. ఆన్ లైన్ ద్వారా తమ విరాళములు పంపదలచిన వారు
1) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కాకుమాను A/c. No. 11622149375, IFS Code: SBIN 0003120 లేక 2) ఆంధ్రాబ్యాంకు, బాపట్ల A/c. No. 003710011023631, IFS Code : ANDB0000037
3) హెచ్.డి.యఫ్.సి.. బ్యాంకు A/c. No. 50100078146390, IFS Code : HDFC 0002642
ఆన్లైన్ ద్వారా విరాళములు పంపదలచిన వారు, పంపిన వెంటనే వారి చిరునామా, పంపిన తేది మరియు బ్యాంక్ వివరములు శ్రీ విశ్వజననీ పరిషత్తు e-mail ద్వారా కాని, ఫోన్ ద్వారా కానీ తెలియజేయగలరు. రశీదు మరియు ప్రసాదములు పంపుటకు ఈ వివరములు చాలా ముఖ్యము.
విరాళములతో నిమిత్తములేకుండా, ఈ మహత్తర ధాన్యాభిషేకం కార్యక్రమంలో పాల్గొని, విశ్వ కల్యాణ మూర్తులు శ్రీ అనసూయా నాగేశ్వరుల కృపకు పాత్రులు కాగోరుచున్నాము.
ఇట్లు
శ్రీ విశ్వజననీపరిషత్,
బాపట్ల మండలం, గుంటూరు జిల్లా జిల్లెళ్ళమూడి-522113,
ఫోన్ : 08643-227324, 227492, 5: 9441061599, 9491615215