19.10.13న మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీలో ఉదయం 10 గంటలకు ఆడపిల్లల వాలీబాల్ పోటీలను అమ్మ కోడళ్ళు శ్రీమతి శేషు, శ్రీమతి వైదేహి, ప్రిన్సిపాల్ శ్రీమతి బి. సుగుణ, శ్రీమతి బి. వాణి, గ్రామసర్పంచ్’ ప్రారంభం చేశారు. సర్వశ్రీ రవి, లక్ష్మణరావు, రమేష్, దినకర్, శ్రీమతి వసుంధరలు పాల్గొన్నారు.
ప్రధమస్థానం Z.P. High School, పావులూరు
ద్వితీస్థానం Z.P. High School, బూదపాడు
(ప్రకాశంజిల్లా) గెలుచుకున్నారు.
20.10.13న నాన్నగారి జన్మస్థలమైన రేటూరు జెడ్.పి. హైస్కూలులో బాలుర బాల్ బాడ్మింటన్ పోటీలు,జరిగినవని నాన్నగారికి ఇష్టమైన ఈ ఆటలో పోటీలు నిర్వహించటమైనది. ఈ పోటీలను అమ్మా నాన్నగారల కుమారుడైన సోదరుడు శ్రీ బ్రహ్మాండం రవి, విశ్వజననీ పరిషత్ అధ్యక్షలు సోదరుడు శ్రీ దినకర్ ప్రారంభించారు.
ఈ పోటీలలో ప్రధమస్థానమును జెడ్.పి. హైస్కూల్ అబ్బినేనిగుంటపాలెం, ద్వితీయస్థానమును జెడ్.పి. హైస్కూల్, రేటూరు వారు గెలుచుకున్నారు.
ఈ పై ఆటలపోటీలలో విజేతలకు 23.10.2013న జిల్లెళ్ళమూడిలో జరిగిన శతజయంతి ఉత్సవసభలో బహుమతి ప్రదానము గావించారు. ఈ క్రీడలను సోదరులు శ్రీ లాలా నిర్వహించారు.