మనసు వెన్నెల స్పర్శయో
మాట తియ్యని సంద్రమో
అమ్మ అంటే అమృతమో
నిర్వికార రూపమో..!!
చూపులోన అమృత కిరణము
చేతినలం అభయ ముద్రయు
చరణద్వంద్వం ముక్తిధామం
చిన్మయత్వమె మాతృరూపం!!!
నామ స్మరణ ప్రణవనాదము
అమ్మ సూక్తులె వేదసారము
అందరిల్లె అన్నసదనము
అర్కపురమె ప్రేమ నిలయం!!