అమ్మా!
నాలోనే దాగివున్న నిన్ను
ఎక్కడో వెతుకుతున్నాను
ఈ ప్రపంచపు బ్రతుకుపోకడలు
ఎంతో సారహీనంగా
స్వార్ధ పూరితంగా అనిపించి
పరితపించే వేళలో….
కనిపించకుండా అందిస్తావు నీ స్నేహ హస్తాన్ని,
వినిపిస్తావు మౌన సందేశాన్ని
అంతటా వున్నదీ, అన్నీ అయినవీ నేనే ననీ,
నిశ్చింతగా సాగిపొమ్మనీ
ఇంతలో….
కనిపిస్తుంది ఒక ఆశాకిరణం
స్ఫురిస్తుంది నీ నామమహత్మ్యం
అందిస్తుందది జీవచైతన్యం
ప్రవహిస్తుంది నీ ప్రేమ ప్రవాహం
బీడువారిన నా మనోక్షేత్రాన్ని సస్యశ్యామలం చేస్తూ
– అమ్మా!
నాలోనే దాగివున్న
నిన్ను ఎక్కడో వెతుకుతున్నాను