సర్వము నీవే, దైవము నీవే – అబ్బూరి నున్న
సకలశాస్త్ర సారాంశము నీవే
మదిలో నీ నామస్మరణ నిత్యం
ఎదలో నీ యెడ భక్తిపారవశ్యం సత్యం
ఇది అమోఘం, అనిర్వచనీయం, అతిముఖ్యం
పదిలంగా ప్రసరించే మహిమల ప్రాముఖ్యం
నినుకొని యాడ ఎవరితరము
నీ వొసంగనిచో బహుమూల్యవరము
కొండంత అండదండ నీ పెన్నిధి
పండిత పామరజనావళికి నీ సన్నిధి
కులమత తారతమ్యంలేని సంవిధానం,
సులభంగా ఋజువుపరచే నిత్యాన్నదానం,
భక్తితో విను దర్శించని జన్మ వ్యర్థం,
ముక్తి కొరకు నిను వేడుటయే పరమార్థం.