“అంతరం’ అంటే హద్దు. హద్దులు లేక అంతటా వ్యాపించి ఉన్నదేవి ‘నిరంతరా” – భారతీవ్యాఖ్య.
మానవులమైన మనకు ఎన్నో హద్దులు ఉంటాయి. శ్రీ లలితాపరాభట్టారిక – ‘నిరంతర’. అంటే హద్దులు లేని తల్లి. ఆమె ‘వ్యాపిని’. అంతటా వ్యాపించి ఉండే తల్లి. ఎప్పుడూ ఉండే ఆ శ్రీమాత ‘నిత్యా’. అలాంటి శ్రీ లలితకు హద్దులు లేవు. అంతటా వ్యాపించి ఉన్న తల్లికి హద్దు అనేది ఎక్కడ? అందుకే ఆమె ‘నిరంతర’.
“అమ్మ” – నిరంతర’. “ఈ సృష్టిలో నేను కానిదీ, నాది కానిదీ లేదు” అని చెప్పిన “అమ్మ”కు ఈ సృష్టితో అభేదమే కదా! అందుకే “అమ్మ”కు ఏ హద్దులూ లేవు. ఏ “అంతటా ఉన్న అమ్మ తెలియడానికే ఈ అమ్మ” అని చెప్పిన “అమ్మ” ‘నిరంతర’. అంతటా నిండి ఉన్న “అమ్మ”కు హద్దుకు అవకాశమెక్కడ? అందుకే అంటుంది “అమ్మ” – నాకు “అడ్డు గోడలులేవు” అని. ఒక గదికో, భవంతికో ఒక హద్దు ఏర్పరచడానికి గోడ కడతాం. కానీ, హద్దులే లేని “అమ్మ”కు అడ్డుగోడలు ఎక్కడని కడతాం?
బాల్యంలోనే “అమ్మ” సర్వవ్యాపకత్వాన్ని తెలియచేసే సంఘటనలు ఎన్నో జరిగాయి. చిన్నపిల్లగా ఉన్న “అమ్మ”కు దీపావళి పండుగనాడు తలంటు స్నానం చేయిస్తున్నారు. కుంకుడు రసం జారి కళ్ళల్లో పడుతుంటే దాన్ని కూడా లెక్కచేయకుండా – ఏదో ప్రమాదం జరుగుతూ ఉంటే చూస్తున్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న “అమ్మ”ను చిదంబరరావు తాతగారు “అనసూరీ” అని గట్టిగా పిలిచారు. కాని “అమ్మ” నిర్నిమేషగా ఉండిపోయింది. ఇంతలో ఒకామె పరుగు పరుగున చిదంబరరావు తాతగారింటికి వచ్చి, తన కోడలుకు ప్రమాదంగా ఉ ందనీ, ఆసుపత్రికి పంపామనీ చెప్పి, వారిని ఆసుపత్రికి రమ్మనీ కోరింది. అయితే, ఈ సంగతి చెప్పక ముందే “అమ్మ” – ఆమె రాగానే “మీ కోడలికి ఎట్లా ఉంది?” అని ప్రశ్నించింది. తాతగారు చాల ఆశ్చర్యపోయారు.
అదేరోజు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎన్నో జరుగుతాయి అన్నట్లుగా “అమ్మ”
“ఇంకా ఇలాంటివి ఎన్ని జరిగినయ్యో” అనడం తాతగారికి మరింత ఆశ్చర్యం అనిపించింది. ఆసుపత్రికి తాతగారు వచ్చిన కొద్ది సమయంలో ప్రమాదాలకు గురైన వ్యక్తులను అక్కడికి తీసుకురావడంతో తాతగారు అవాక్కయ్యారు.
ఇంకా పసితనంలోనే “అమ్మ” తన సర్వ వ్యాపకత్వాన్ని తెలియచేసిన సంఘటన మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. “అమ్మ”కు అమ్మగారైన రంగమ్మ గారు మరణించినప్పుడు కార్యక్రమం అంతా ముగించుకుని అందరూ ఇంటికి చేరారు. “అమ్మ” ఇంటివద్దనే ఉన్నది. అయితే, దీపాలవేళ దీపపుకాంతిని నిశ్చలంగా చూస్తూ “అమ్మ” – “తాతగారూ అమ్మ కాలిపోతున్నదనే వాక్యంతో మొదలు పెట్టి, శ్మశానవాటికలో ఆ సాయంత్రం జరిగిన సన్నివేశాన్ని పూసగుచ్చినట్లు వివరించి చిదంబరరావుగారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది.
ఇలాంటి సంఘటనలు ఎన్నో “అమ్మ” జీవిత మహోదధిలో తరంగాలుగా తారసపడుతూ “అమ్మ”ను ‘నిరంతర’గా మనకు సాక్షాత్కరింప చేస్తాయి.
“అమ్మ” వాక్యాలను పరిశీలిస్తే “అమ్మ” సర్వవ్యాపకత్వం ప్రతి అక్షరంలోనూ ప్రస్ఫుటమవుతూ “నిరంతరంగా “అమ్మ”ను మనకు పట్టి చూపుతుంది.
“అమ్మ”ను ఏయే సమయాల్లో చూడటానికి అవకాశం ఉంటుంది? అని ప్రశ్నించిన ఒకరితో “దైవ సన్నిధికి ఒక సమయమంటూ యేమున్నది? అమ్మ అడ్డులేనిది” అని ఎంతో స్పష్టంగా తనకు ఏ అడ్డూ లేదని చెప్పింది “అమ్మ”. ఇంకొక సందర్భంలో “ఎప్పుడూ నాకు నేనే అడు. నాకు ఎవరూ అడ్డుగా రాలేదు. రాలేరు” అని తనకంటూ ఏ అడ్డూ లేదని, ఏదైనా ఉంది అనుకుంటే అది తనకు తాను విధించుకున్నదే తప్ప, ఇతరుల వల్ల ఏర్పడినది కాదని తేటతెల్లంగా తెలియచేసిన “అమ్మ”- ‘నిరంతర’.
‘నువ్వు చూడని వాళ్ళెవరమ్మా?’ అనే ప్రశ్నకు “చూడని వాళ్ళు కనపడరిక్కడ” అనే “అమ్మ”. సమాధానం ఎక్కడ ఉన్నవారినైనా చూడగలిగిన సర్వాంతర్యామిని “అమ్మ” అని తెలియచేస్తుంది. “అదేమిటో నాకు ఎవ్వరూ చూడనట్టు ఉండరు. అంతా చూసినట్టే ఉంటారు.” “మీకు ఎప్పుడు చూసినట్ట అనుమానం. నాకు ఆ అనుమానం లేదు. ఎప్పుడు చూస్తున్నట్లే ఉంది”, “మీరు ఇక్కడికి వచ్చిన చూస్తారు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూన ఉన్నాజి, “అందరూ ఎప్పుడూ చూడరు నన్ను నేను అందనీ ఎప్పుడూ చూస్తాను” వంటి “అమ్మ” వాక్యాలన్న అమ అంతటా వ్యాపించి ఉన్నది అనే విషయాన్ని మ సుస్పష్టం చేస్తాయి.
‘అమ్మా! మంత్రపుష్పం నీ సన్నిధిలో మాత్రమే చదవాలి కానీ ఎక్కడపడితే అక్కడ చదివితే ఎట్లా అని ఒకరు “అమ్మ”తో తన మనసులోని బాధను వ్య చేస్తే, “నేను అంతటా ఉన్నానంటూ నా సన్నిధిని గిరిగిస్తున్నావేం?” అని ప్రశ్నించి తన సర్వవ్యాపకత్వాని ప్రకటించిన “నిరంతర” “అమ్మ”.
“అమ్మ” జీవిత సన్నివేశాలు, “అమ్మ” వాక్యాలు “అమ్మ”లోని సర్వవ్యాపకత్వానికి అద్దం పడుతూ ‘నిరంతర’గా “అమ్మ”ను మనకు ప్రత్యక్షం చేస్తాయి.
అందరింటిలోని అనసూయేశ్వరాలయంలో కొలువు తీరిన అనసూయాదేవిని ‘నిరంతర’గా నిరంతరం దర్శిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ తరిద్దాం.
జయహోూమాతా ! శ్రీ అనసూయా!