13.02.2022 ఆదివారంనాడు గుంటూరులో మనలను అందరినీ వీడి జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధికి అరుదెంచిన పి.యస్.ఆర్. గారు మరీమరీ గుర్తుకు వస్తున్నారు. మాది సుదీర్ఘమైన అనుబంధం; బంధుత్వం; భువనవిజయాలు, తదితర సాహిత్యరూపకాలు సరేసరి.
ప్రదర్శనలకు ముందు కాగితం, పెన్నుతో ఎదురుగా వచ్చి సుందరరామకృష్ణా! నీది ‘సమస్య’నా? లేక ‘దత్తపదా”? ఎంటో చెప్పమని దగ్గరకువచ్చి అడుగుతూ ఉండటం – ఆ ముఖకవళికల ఆ గర్తపురి, వాగ్వైఖరి. ఒకటేమిటి అన్నీ గుర్తుకువస్తున్నాయి.
అరయన్ సుందరు నన్నుమించు వర వీరావేశునిన్ డెందమం
దు, రవంతేనియు ‘గీర’లేని గుణసింధున్ బంధుశీలిన్ ఘనున్
హరిశ్రేష్టుండగు వాని నాముడగు పి.య.స్సారు పేర్లన్న గుం
టురికే చూడగ పెద్దదిక్కు, మతియింతున్ వాని సద్భక్తితోన్!
బాధాతప్త హృదయంతో.. అశ్రునయనాలతో