(గతసంచిక తరువాయి భాగం)
1982 నుంచి అమ్మతో నాకు intimacy ఎక్కువయింది. Vidyalayam strength పెరిగింది, teaching staff పెరిగారు. ఆ time లో జిల్లెళ్ళమూడి అధ్యయనపరిషత్, అమ్మ దగ్గర college staff మా staff అంతా (అమ్మ దగ్గర) సమావేశమయి మాకున్న doubts అమ్మతో చర్చించవచ్చు అన్నారు. అందరం అమ్మ దగ్గర సమావేశమయ్యాము. రామకృష్ణ అన్నయ్య పర్యవేక్షణ. ముందర విద్యాలయం staff అడగాలి అన్నారు. అన్నపూర్ణ teacher అడిగింది. “అమ్మా ! స్త్రీలకు ప్రత్యేకించి నువ్విచ్చే సందేశమేమిటి ? అని, అమ్మ అన్నారు “నాకు గుణబేధమే లేదు. ఇంక లింగభేదమేముంటుంది? ప్రత్యేకంగా స్త్రీలకేముంది అమ్మా? ఎవరి ధర్మం వాళ్ళు పాటించటమే’ అన్నది. Next నన్ను అడగమన్నారు. ‘అమ్మ! ఎప్పటినుంచో నాకో ఆలోచన వస్తోంది. అసలు ‘నేను’ అంటే ఏమిటి? ఎంత ఆలోచించినా శూన్యం తప్పితే ఏమీ అనిపించటం లేదు. అడగటంలోనే నా పొరపాటు నాకర్ధమై పోయింది. అమ్మ అన్నారు. ‘శూన్యం కనిపిస్తోంది కదా! ఇంకేం! అని ఆ తర్వాత ‘నువ్వు అరుణాచలేశ్వరుడికి సంబంధించిన దానివి అందుకే అలా అనిపిస్తోంది’ అంది. అమ్మ మంచం చుట్టూ అందరం కూర్చునేసరికి ఇరుకుగా అనిపించి అడిగిన వాళ్ళు బైటికి వెళ్ళి కూర్చోవటం జరిగింది. దాంతో మిగిలిన వాళ్ళు ఏమడిగారో వినిపించలేదు. ఆ తర్వాత 1985 అమ్మ ఆలయ ప్రవేశం అయిం తర్వాత అరుణాచలం వెళ్ళి అక్కడ 3రోజులు ఉండి గిరి ప్రదక్షిణం చేయటం జరిగింది.