1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నీ కరుణచూపు జల్లులోనే నన్ను తడవనీయవమ్మ ?

నీ కరుణచూపు జల్లులోనే నన్ను తడవనీయవమ్మ ?

Pogula Srinivasarao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : August
Issue Number : 1
Year : 2013

ఎంత చల్లని మాయివమ్మా

ఎంత కరుణామయివమ్మా

కలివెలసిన ఆకలివైరీ ! అనసూయా శ్రీనారీ !

ఆచంద్రతారార్కం నీ నగరీవిభవం

కూటి కొఱకె కోటి విద్యలంట

జగతి జనులు కదియే బహుమతంట

 కొందరిదే నీతి నియమపంట

మరియెందరో అవినీతి వెంట

కోట్లు కూడబెట్టినా మేడలెన్ని కట్టినా

వేయికోట్లవాడైనా బంగరు మింగలేడు 

వేళకింత అన్నమే ఎవ్వరైనా తినేది

ఆ అన్నములో ప్రేమ కలిపి తినిపించినావు.

 మనుజజన్మ పరమార్ధము వినిపించినావు!

ఆంత్యములో అందరికి ఆరడుగులె చోటు

అంతులేని అడ్డులేని ఆశలె పెనుచేటు

 ఎందుకమ్మ తీరని ఈ ధనదాహం

ఎదకు శాంతి నొసగని ఈ వ్యామోహం

నీవొసగిన ఈ తనువే ఒక హద్దుల బొమ్మ 

పరిమితియే అందించును పరమానందపు కొమ్మ

ఆత్మతృప్తి కన్న ఏ సంపద మిన్న!

 అవని జనుల హితము చూడ కీర్తి తాకు మిన్ను

 ఆ హితమున ప్రేమకలిపి చేసి చూపినావు.

మనుజ జన్మ సార్ధకతకు మణిదీపికవైనావు! ॥ ఎంత॥

బ్రహ్మత్వము పొందిన మరో బ్రాహ్మివమ్మా !

 ద్వంద్వాతీత గుణాతీత మహాదుర్గవమ్మా !

క్షుత్తుబాపి రక్షసేయు రమణి హరిణివమ్మా! 

మహోదాత్త మహోన్నతం నీ అనుపమచరితం.

నీ చరితము పఠియించిన జన్మలు చరితార్థం.

 నీ అడుగులోన అడుగువేసి నన్ను నడవనీయవమ్మ!

నీ కరుణచూపు జల్లులోన నన్ను తడవనీయవమ్మ!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!