నీ కోసమే నా జీవితం
నీ సేవకే నేనంకితం
ఏనాటికీ మా తల్లివి నీవేనుగా
ముమ్మాటికీ ఆ తొల్లివి నీవేనుగా
ఏ జన్మలో ఏ పుణ్యమో చేసినానూ
ఈ జన్మలో నీ మూర్తినే చూసినానూ
ఏ పూలతో ఏ పూజనూ సల్పినానో
ఈ దారిలో నీ చెంతకే చేరినాను.
సౌందర్యమే నీ రూపమై ఈ నేలకూ దిగివస్తివీ
కారుణ్యమే నీ తత్వమై ఈ జగతికీ అందిస్తివీ
వేదాలనే నీ వాణిగా లోకాలకూ వినిపిస్తివీ
అనురాగమే నీ వీణగా రవళించుతూ మురిపిస్తివీ
నీ తోటలో ఒక పూవుగా వికసించగా తలపోస్తినీ
నీ బాటలో ఒక రేణువై అణగారగా తపియిస్తినీ
నీ ప్రేమయే నా రక్తమై బ్రతుకెల్లనూ జీవిస్తినీ