1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నీ నామమే… (గజల్)

నీ నామమే… (గజల్)

M.B.D. Symala
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : April
Issue Number : 9
Year : 2022

అమ్మా! నీ నామమే అమృతోపమానము

 అమ్మా! నీ నామమే సర్వ తీర్థయాత్ర స్నానము

 

ఎన్ని సార్లు పలికినా తనివి తీరబోనిది

 అమ్మా ! నీ నామమే నను వీడని ధ్యానము

 

తపసు రాదు ధ్యాస పోదు యోగమసలే లేదు 

అమ్మా! నీ నామమే నే నేర్చిన గానము

 

కష్టసుఖములేవైనా కలతలేదు మదికి 

అమ్మా! నీనామమే మోక్షమిచ్చు జ్ఞానము

 

 శ్యామ నెన్నడూ వీడని తోడు నీడ నీవే

 అమ్మా! నీ నామమే నాకు అన్నపానము

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!