1. Home
  2. Articles
  3. నీ ప్రతి కదలికా

నీ ప్రతి కదలికా

Brahmandam Vasundhara
Magazine :
Language : Telugu
Volume Number : 11
Month : May
Issue Number : 10
Year : 2012

అమ్మా !

నీ మధుర మంజుల మనోజ్ఞవదనమే

మామది 1 వేదనల్ వెలికి త్రోయు.

నీకృపా కటాక్ష వీక్షణలే – మా హృది నిండుగా వెల్గులు

 నింపు 

నీ ప్రశాంత పరమ పావన పాదసన్నిధీయే 

మాకు శాంతి గూర్చు

నీతోటి సాహచర్యమే మాకు శాస్త్రాల, పాఠాల మంత్రాల 

నేర్పు.

గాఢాంధకారాన నీ చల్లని పలుకులే

అమృత సోనలై చిల్కరించు

 నీ సుందర చిరుదరహాసములే

మామది వెన్నెలలు కురియు

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!