మానవులందరికి అవసరం చదువు
అది చెప్పడానికి కావాలి గురువు
లేకపోతే మనకు వస్తుంది కరువు
చదువులో తెలుసుకోవాలి ప్రతి అణువు
చదువు లేకపోతే పోతుంది మన పరువు
విద్య లేనివాడు వింత పశువు
పొలానికి బలము ఎరువు
ప్రకృతిని కాపాడుతుంది తరువు
నీటితో నింపాలి ప్రతి చెరువు
ఇవి లేకపోతే జీవితం బరువు
జీవితానికి జీవనానికి అమ్మే కల్పతరువు
చదువు వల్ల వస్తుంది ఆనందము
అవి ఉంటే ప్రతి ఒక్కరికి సౌందర్యము
మంచి గ్రంథ సుమాలలో ఉంటుంది మకరందము
ప్రతి విద్యార్థి తుమ్మెదై గ్రహించాలి రసానందము
చదువు వల్ల వచ్చే గౌరవము
ఉంటుంది అది కలకాలము
జ్ఞానము బ్రతికిస్తుంది చిరకాలము
చదువులో చెందకూడదు కలత
చదువులో ముందుడాలి మన యువత
సాధించాలి మనం ఒక ఘనత
అది కావాలి కొత్త చరిత