జగమేలే పరమాత్మకూడా తన ఉనికిని (Identitee) ని తెలుపుకోవలసిన ఆవశ్యకత వున్నదా? కోదండరాముడు, మురళీకృష్ణుడు, బలరాముడు, రమణమహర్షి, శిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా, ఏసుక్రీస్తు, బుద్ధభగవానుడు, జిల్లెళ్ళమూడి అమ్మ మొదలగు మహనీయులున్నారు. వారి ఉనికి అయిన రామునికి కోదండము. కృష్ణునకు నెమలిపింఛము, బలరామునకు నాగలి, శిరిడీ సాయికి కఫ్నీ, సత్యసాయికి తలజుట్టు, రమణ మహర్షికి కౌపీనము, అమ్మ ముఖమునకు తేజో విరాజిత అయిన అరుణకాంతులీను భృకుటిలో కుంకుమబొట్టు, క్రీస్తుకు శిలువ, బుద్ధుడికి బోధిచెట్టు. ఈ సాంకేతికాలే లేకపోతే వీరిని గుర్తుపట్టటం సంభవమా ? ఇవి లేకుండా వీరిని గుర్తుపట్టటం ఎట్లా ? ఈ గుర్తులు వారి వారి అవసరాలను బట్టి కూడా కొన్ని కలిగినవి. ఉదాహరణకు కోదండరామునికి ఆయన అరణ్యప్రవేశం చేయవలసి వచ్చినప్పుడు కోదండము విల్లు, అమ్ములు తప్పక ఆవశ్యకము ఏర్పడినవి. అట్లాగే కృష్ణునకు, బలరామునికి మిగతావారికి ఈ సాంకేతికాలే లేకపోతే వీరిని మనం గుర్తుపట్టటం ఎట్లా ? ఒక యోగిని గుర్తుపట్టటానికి ఒక యోగి మాత్రమే గుర్తుపట్టగలరట. మరి పరమాత్మను గుర్తుపట్టటం ఎట్లా ? పరమాత్మను గుర్తు పట్టటానికి పరమాత్మే కావలెనా ? అటువంటివారికి ఈ గుర్తులేవీఅవసరం లేదు. కారణం వారు అదే కాబట్టి. మరి ఈగుర్తులు దేనికి ? పామరులు గుర్తుపట్టటానికి.
వీరు పరమాత్మ స్వరూపులైనప్పటికి, వచ్చింది మానవ స్వరూపులుగానే అనగా’ జీవాత్మలుగానే. ఎప్పుడైతే జీవుడుగా వచ్చాడో అప్పుడే ద్వంద్వాలు జీవిత పరిమితి ఏర్పడతాయి. పరిధులు ఏర్పరచినవాడు కూడా దానికి బద్ధుడే. కనుక జీవి పుట్టిన తరువాత గిట్టక మానదు. కనుకనే వీరంతా కూడా వచ్చిన చోటికే పోక తప్పలేదు. వీరు వచ్చేటప్పుడే జీవితకాలపు నిర్ణయాలు చేసుకొని మన మానవాళిని ఆత్మానుసంధానముగా చేయటానికి ఎవరికి వారు వారి పంధాలో వ్యవహరించారు. అంతవరకు కృతకృత్యులయ్యారు. ఇంకా యుగాలలో ఇట్లానే అవతరిమానవ స్వరూపులుగానే అనగా’ జీవాత్మలుగానే. ఎప్పుడైతే జీవుడుగా వచ్చాడో అప్పుడే ద్వంద్వాలు జీవిత పరిమితి ఏర్పడతాయి. పరిధులు ఏర్పరచినవాడు కూడా దానికి బద్ధుడే. కనుక జీవి పుట్టిన తరువాత గిట్టక మానదు. కనుకనే వీరంతా కూడా వచ్చిన చోటికే పోక తప్పలేదు. వీరు వచ్చేటప్పుడే జీవితకాలపు నిర్ణయాలు చేసుకొని మన మానవాళిని ఆత్మానుసంధానముగా చేయటానికి ఎవరికి వారు వారి పంధాలో వ్యవహరించారు. అంతవరకు కృతకృత్యులయ్యారు. ఇంకా యుగాలలో ఇట్లానే అవతరిస్తుంటారు.
ఈ శతాబ్దిలో మన మధ్య అమ్మ అవతరించి మనతో నడయాడి మనకు గోరుముద్దలు తినిపించిఅన్నపూర్ణేశ్వరిగా ప్రసిద్ధి చెంది నిరంతరం అన్నవితరణ చేయుచు ఎవరి అన్నము వారే తింటున్నారు అంటూ మానవులకే కాక క్రిమి కీటకాదులకు కూడా తన ప్రేమను పంచుతూ తాను ఆత్మగా భాసించి అందరినీ బ్రహ్మోన్ముఖులుగా భావించి ఆత్మస్వరూపముగనే పరిగణించింది. అనేక అవతారాలు ఇంతవరకు వచ్చినప్పటిగా తొలిగా, తల్లిగా, ప్రేమావ తారంగా అవతరించి మన మధ్య అందరికీ అందుబాటులో వుండటం ప్రత్యేకంగా మన అదృష్టం అనే చెప్పాలి.. అనేకమంది కవులు, పండితులు, ఆత్మాన్వేషకులు అమ్మను దర్శించి ధన్యులైనారు.
ఈ మహామహులు తమ తమ శరీరములను త్యజించినారు ఆత్మలో లీనమై ఆత్మగానే భాసిస్తారు. వారిశక్తియుక్తులకు ఎటువంటి అవరోధము వుండదు.