6-8-2023న పార్వతీపురం ‘అమ్మ’ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. పార్వతీపురం అమ్మ అన్న ప్రసాద వితరణ ప్రాంగణంలోనూ, జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి పార్వతీపురం ద్వితీయ వార్షికోత్సవ సభలోనూ అమ్మ నామంతో అందరూ పులకరించి పోయారు. పార్వతీపురం సోదరులకు తోడుగా మేమున్నాం అంటూ వచ్చిన విశాఖపట్నం, విజయనగరం, యస్. కోట, పాలకొండ, రాజాం, శ్రీకాకుళం మొదలైన అన్ని ప్రాంతాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు, అభిమానులు, అమ్మ కుటుంబం, పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరం, పాలకొండ సభ్యులు అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పార్వతీపురం ఈరోజు అమ్మ బిడ్డలతో నిండిపోయింది. జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి పార్వతీపురం వారి ద్వారా నిర్వహించబడిన శ్రీ విరాల రామచంద్రమూర్తి గారి పద్య శతకం అక్షరార్చన ఆవిష్కరణ కార్యక్రమం నభూతో న భవిష్యతి అన్న రీతిలో జరిగింది. సుమారు 150మందితో సభాభవనం కిటకిటలాడింది. అప్పటి కళాశాల విద్యార్థులు అమ్మ అమృతాశీస్సుల ప్రభావంతో మహా పండితులుగా, అద్భుతమైన వక్తలుగా మలచబడి హేమా హేమీలుగా సమాజంలో పేరుప్రఖ్యాతులు సంపాదిస్తున్నారనే విషయం ఈరోజు తేటతెల్లమైంది. సోదరులు కర్రి జనార్ధన, యం. ఉమామహేశ్వరరావు, రంగాచార్యులు, బౌరోతు శంకర రావు, సోదరి కస్తూరి మొదలైన వారంతా అమ్మ ప్రేమను, పార్వతీపురం అమ్మ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అద్భుత రీతిలో వర్ణించిన తీరును, వారి వాగ్ధాటిని చూసి అందరూ ఎంతో ఆశ్చర్య చకితులయ్యారు. ఈరోజు అన్నిచోట్లా అమ్మ బిడ్డలే.. ఆనాటి కళాశాల ముచ్చట్లే… అమ్మ ప్రేమానురాగాల చర్చలే.. నేటి ఈ అద్భుతమైన కార్యక్రమం జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి పార్వతీపురం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అమ్మ. బిడ్డలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేటి మన పార్వతీపురం అమ్మ అన్నప్రసాదవితరణకు, శ్రీ మంచిపల్లి, శ్రీరాములు గారు, పార్వతీపురం, శ్రీ వంకాయల సీతారామయ్య గారు, విశాఖపట్నం, శ్రీమతి చుక్క మాధవి గారు, (జి.సరళక్కగారి కుమార్తె,) హైదరాబాద్, ఆర్థిక సహకారం అందించారు. వారికి అమ్మ కుటుంబం పార్వతీపురం తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమ్మ వారందరికీ ఎల్లవేళలా అండగా ఉండాలని చల్లగా చూడాలని కోరుకుంటున్నాం.
పార్వతీపురంలో అమ్మ ప్రసాద వితరణ – ద్వితీయ వార్షికోత్సవం
Gamteda Chinnam Naidu
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022
Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.