పూజ

Prof. K. Kameswara Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 12
Month : November
Issue Number : 4
Year : 2012

అమ్మని తల్చుకో.

అమ్మకు నమస్కరిస్తున్నట్టు పాదాభివందనం చేస్తున్నట్టు

అమ్మ నీ వీపు మీద చేయివేసి రాస్తున్నట్టు.

అన్నం తినిరా నాన్నా! అని అన్నట్టు

అమ్మతో ఆ గదిలో మాట్టాడుతున్నట్టు

అమ్మ చేయిపట్టుకుని ఆ Terrace మీద ఉన్నట్టు

ఆరుబయట అమ్మ మంచం మీద కూర్చుంది, నీకు ప్రక్కనే తోటి అన్నయ్యలతో కూర్చున్నట్టు

అదిగో తెల్ల వాడొస్తునాడ్రా అని అమ్మంటే

జేమ్సు గాని, భీం గాని వస్తున్నారనుకుని అందరూవెనక్కి తిరిగి చూస్తున్నట్టు, వెనువెంటనే ఆ ప్రశాంతమైన వెన్నెలలో ఓ చిరుజల్లు పడినట్టు, ఓహా! తెల్లవాడంటే వర్షమా అని అందరూ తన్మయంతో నవ్వుకున్నట్టు,

నే వెళ్ళొస్తానమ్మా అని నమస్కరిస్తుంటే అమ్మ నీ నొసట కళ్యాణ తిలకం దిద్దినట్టు బరువెక్కిన గుండెతోఅమ్మను వదల్లేక వదల్లేక వెనక్కి తిరిగి అమ్మనే చూస్తూ,కళ్లలో నీళ్లు చిప్పిలుతూ ఆ గుమ్మం దాటి నువ్వు వస్తున్నట్టు

ట్రైన్లో వస్తున్నా జిల్లెళ్ళమూడిలో జరిగిన మధుర క్షణాలను నెమరువేసుకుంటున్నట్టు, ఆనందంగా యింటికి చేరుకోగానే “అమ్మతో మన విషయాలు అడిగారా? అని ఇంట్లో వాళ్ల ఆ సంగతే మరిచిపోయానని మీరుతెల్లమొహం వేసినట్టు,

అంతలోనే అమ్మకు తెలియదా ఏం? తనే చూసుకుంటుందని నువ్వు మీ వాళ్లతో అన్నట్టు. నీ దైనందిన  

జీవితంలో ఏ పనిచేస్తున్నా, ఏం చూస్తున్నా, ఏం మాట్లాడినా ఇవన్నీ అమ్మ దయేగా అనుకుంటూ, చేసే ప్రతి ఆలోచనా, పలికే ప్రతి పలుకు, చేసే ప్రతి పనీ- అన్నీ అమ్మే అని అనుకోవటం కన్నా ఆనందం ఎక్కడుంది? మన ఆలోచనే అమ్మ అయినపుడు దిగులేముంది? “మీరంతా నేనే మీదంతా నేనే” యిదంతా నేనే” – అనే మన కళ్ళ.. – ముందు ‘అమ్మ’ జయహోమాతా!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!