అమ్మ కుటీరాన అలరు వరండాయె
“ముఖమండప”మ్మయి మురిసియుండె
అమ్మ దర్శనమిచ్చు హాలు “గర్భాలయ”
మ్మగుచు వర్ధిల్లెలే ఆదరమున
హాలు వెనుక గది “అంతరాలయ”మయి
అమ్మ తల్పము తోడ అలరియుండె
ఆ ప్రక్కగది “అంతరాంతరాలయ”మయి
మన పొట్ట నింపుచు మాన్యమయ్యె
మరియు ముందుండు “పులికాపుమందిరమ్మె”.
అమ్మ స్నానాలయమ్మది అనిరి బుధులు
అల “కుటీరమ్ము” నట్టులే నిలిపినారు
నేటికిని దర్శనీయమై నిలచియుండె