1. Home
  2. Articles
  3. Viswajanani
  4. పూర్వ విద్యార్థుల సమావేశం

పూర్వ విద్యార్థుల సమావేశం

Unknown
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : October
Issue Number : 3
Year : 2022

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో 20/9/22 మంగళవారం రోజున 2005-2010 పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళాశాల ప్రస్తుత ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్. ఆర్. వరప్రసాద్ గారు అధ్యక్ష భాషణ చేస్తూ ఈ 54 కళాశాలలో విద్య నభ్యసించి ఉన్నత హెూదాలను పొంది తిరిగి మరలా తాము చదువుకున్న కళాశాలలో ఉన్న విద్యార్థులను కలవడం ఎంతో స్ఫూర్తిదాయకమని అభినందించారు. 2005 2010 వరకు విద్యాభ్యాసాన్ని చేసిన తన తోటి విద్యార్థులు అందరి తరపున ప్రాతినిధ్యం వహిస్తూ షణ్ముఖ, లక్ష్మణ్, మాధురిలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తాము చదువుకున్న నాటి స్థితిగతులు వివరించి అమ్మ ఒడిలో నేర్చుకున్న పాఠాలే మమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్లాయని కనుక మీరంతా సద్విద్యార్థులుగా మెలగుతూ జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. అనంతరం పెదలక్ష్మయ్య గారు మాట్లాడుతూ జిల్లెళ్ళమూడి విద్యార్థికి ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపు ఎలాంటిదో స్వయంగా తనకు అనుభవమైన సన్నివేశాన్ని చెప్తూ మనమంతా అమ్మబడి బిడ్డలమని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్వ విద్యార్థులు ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రస్తుత విద్యార్థులకు ప్రోత్సాహకంగా నోటు పుస్తకాలను మరియు పేద, ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు. కార్యక్రమంలో కళాశాలకు అమ్మ చిత్రపటాన్ని సమర్పించారు. అధ్యాపక అధ్యాపకేతర బృందాలకు సన్మానం చేశారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.

Related Articles

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!