1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ప్రభావతి అక్కయ్య

ప్రభావతి అక్కయ్య

Ravuri Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 11
Month : March
Issue Number : 8
Year : 2012

అక్కయ్య 01-09-1942న అమలాపురం తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో మాతామహులయిన అయ్యగారి వారి ఇంట్లో పుల్లేటి కుర్రు గ్రామంలో జన్మించింది. తండ్రి గంగరాజు లోకనాధరావు, తల్లి బుచ్చమాంబ. స్వగ్రామం కొమ్మూరు. బాపట్ల తాలూకా, గుంటూరుజిల్లా, ఆరుగురు తోబుట్టువులలో 2వ సంతానం ఈమె. కొమ్మూరు గ్రామం జిల్లెళ్ళమూడికి 10 మైళ్ళ దూరాన ఉంది. తండ్రిది మధ్యతరగతి వ్యవసాయకుటుంబం.

అమ్మ భర్త శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు (నాన్న) గా ప్రభావతి అక్కయ్య తండ్రిగారు శ్రీ గంగరాజు 1. లోకనాధరావుగారు మంచి స్నేహితులు, నాన్నగార్ని “ఏరా నా” అని సంబోధించేవారాయన. తరచు కొమ్మూరు నించి సైకిల్పైన గోపాపురం వస్తుండేవారు. జిల్లెళ్ళమూడికి గోపాలపురం 2 మైళ్ళ దూరంలో ఉంది. గోపాపురంలో భోజన వసతి లేక ఇబ్బందిపడుతున్న స్నేహితుణ్ణి తమ యింటికొచ్చి భోజనం చేస్తూ ఉండు అని ఆహ్వానించారు నాన్నగారు. ఆయన ఆహ్వానాన్ని పురస్కరించుకొని వీలైనప్పుడల్లా గోపాపురం నుంచి భోజనానికి నాన్నగారి యింటికి వచ్చేవారు లోకనాధరావుగారు, సూర్యచంద్రుల కావాన మయిన చిన్నపూరిపాకలలో భర్త ఆదేశాల్ని తు.చ. తప్పక పాటించే ఆవూరి కరణంగారి భార్య. జగజ్జనని అయిన అమ్మ లోకనాధరావుగార్కి అన్నం వండి వడ్డించేది. |తృప్తిగా అమ్మ పెట్టిన భోజనాల్ని ఆరగించిన లోకనాధరావుగార్కి, అమ్మలో ఒక విశిష్టత గోచరించింది. తన కంతు బట్టని ఒక పవిత్ర భావం ఆయనలో మెదిలింది. భోజనానంతరం ఎదురుగా భోషాణం మీద ‘సీతా రామాంజనేయ సంవాదం’ పుస్తకాన్ని చూచారు. దీనిని నీవు చదువుతున్నావా అమ్మా అని అడిగారు అపుడపుడూ ప్ర. అ. ఉంటాను. పేజీలు తిరగవేస్తూ ఉంటాను అన్న అమ్మతో ఆ పుస్తకాన్ని గురించే యింకొంతసేపు సంభాషణ చేశారు.

ప్రభావతి అక్కయ్య తండ్రి లోకనాధరావుగారూ,  రాజుబావగారి తండ్రి మన్నన బాలకృష్ణశర్మగారు మేనత్త మేనమామ పిల్లలు. ఆవరసలోనే లోకనాధరావుగారు రాజు బావగార్కి మామయ్య బంధుత్వ రీత్యా రాజురావ ప్రభావతి అక్కయ్య బావమరదళ్ళు. ఇంటరు చదివి ఉద్యోగ అన్వేషణలో ఉన్న రాజుబావగారి కొమ్మూరు ILTD See Sonal Job చేయించే నిమిత్తం లోకనాధరావుగారు తల్లి ఇంట్లో ఉంచారు. అది 1954 సంవత్సరం. రాజుబా అయి తగ్గక చేసేది ILTD లో సంవత్సరానికి 3, 4 నెలలు చేసే తాశాన్ని ఉద్యోగం. ఆ రోజులలో లోకనాధరావుగారి కాలిబొటను వేలులో తీవ్రంగా బాధపడుతున్నారు. తాము కదిలి జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించలేక తమ ఇంట్లోనే ఉంటున్న రాజు బావ  అమ్మనడిగి కుంకుమపొట్లాలు తెమ్మనమని జిల్లెళ్ళమూడి పంపారు. చిత్రం ఈ కారణంగా అమ్మ తాను ఎంచు కొన్న యింకొకరిని తన వద్దకు తీసుకొంది. తర్వాత కాలి బొటనవేలు బాధ తగ్గక లోకనాధరావుగారు గుంటూరు హాస్పిటల్లో చేరారు. తండ్రి సేవల నిమిత్తం ప్రభావతి అక్కయ్య గుంటూరులో రాజు బావ తండ్రిగారి యింటికి చేరింది. ఆ బాధలో అమ్మను గుంటూరు హాస్పిటల్ దర్శించకోరి తన స్నేహితుడు నాన్నగార్ని ఆర్జించారు. లోకనాధరావుగారు. స్నేహితుని అభ్యర్థనను మన్నించిన నాన్నగారు అమ్మను గుంటూరు తీసుకొని వెళ్ళి హాస్పిటల్ లోకనాధరావుగార్కి చూపించారు. ఆ సందర్భాన అమ్మన రాజు బావగారితో గుంటూరులోని వారింటికి వెళ్ళింది.

మొదటిసారిగా 13 సంవత్సరాల వయస్సు గల ప్రభావతి అక్కయ్యను అమ్మ అక్కడ చూచింది. జరగబోయేది ముందే తనకు తెలుసుకాబట్టి ప్రభావతి అక్కయ్యతో అమ్మ ఇలా సంభాషించింది.

అమ్మ: నా దగ్గర జిల్లెళ్ళమూడిలో ఉంటావా?

 ప్ర.  అ . ఉంటాను.

అమ్మ : ఇక్కడ లాగా అక్కడ ఉండదు. అది చిన్న పల్లెటూరు. మాది చిన్నపూరిల్లు, ఎలుకలు, ఎలుకలు తవ్విన కన్నాలు, పిల్లులు, కుక్కలు, పాములు అన్నీ ఉంటాయి. ఇక్కడీలా ఉండదు. ఉండగలవా?

 ప్ర.  అ . ఉంటాను.

అమ్మ : ఎట్లా వుంటావు?

ప్ర.అ.: నువ్వున్నావుగా. అని దృఢచిత్తంతో 13 సంవత్సరాల ప్రభావతి అక్కయ్య సమాధానం.

అమ్మ : నవ్వి వూరుకొంది. అప్పటి సంభాషణ అంతకంటే సాగలేదు.

ఇంటిపనులూ వంట పనులు చేసుకొంటూ అమ్మ తరచూ సమాధి స్థితిలో అచేతనంగా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయేది. సమాధిస్థితిలో పొయ్యి మంటల్లో పడిపోతుందేమో అనే ఆలోచన లోకనాధరావుగారిని కలవరపరచింది. అమ్మకు ఇంటి వంటపనుల నుండి స్వాంతన కల్పించే నిమిత్తం 13 సంవత్సరాల ప్రభావతి అక్కయ్యని అమ్మ సేవకై జిల్లెళ్ళమూడి పంప సంకల్పించారు.

1955 లో తండ్రి ఆదేశానుసారం అమ్మసేవకై కొమ్మూరు నుంచి జిల్లెళ్ళమూడికి మొదటిసారిగా నడిచివచ్చి అమ్మను దర్శించింది ప్రభావతి అక్కయ్య. చిన్నతనం నుంచే ఆ ఉబ్బసం వ్యాధి బాధించేది. లోకనాధరావుగార్కి తమ కూతురు అమ్మ సేవచేసుకొంటే ఆవ్యాధి తగ్గవచ్చనే లేకపోలేదు.

ప్రభావతి అక్కకు అన్నం ఎలా వండాలి. కూరలు ఎలా చేయాలి. అనుపాకంలో ఉప్పు ఘ్రాణం ఎంత ఉండాలి. తిరగమోత ఎలా పెట్టాలి అనే విషయాలను వారం రోజులు అమ్మ మొదట్లో దగ్గరుండి శిక్షణ నిచ్చింది. తర్ఫీదు ఇచ్చింది జగన్మాత కదా! అనతికాలంలో ఆయా పనులలో అక్కయ్య నిష్ణాతురాలయింది. ఆరోజులలో రమారమి రోజుకు 10 మంది దాకా అమ్మను దర్శించేందుకు వచ్చేవారు. అందరికీ వండి వడ్డించేది. అమ్మ : ఇప్పుడా బాధ్యతని అక్కయ్య ద్వారా అమ్మనెరవేర్చ పూనుకొంది. అప్పటికి చిన్నపిల్లలయి అమ్మ గర్భవాసాన జన్మించిన సుబ్బారావు అన్నయ్య హైమక్కయ్య, రవి అన్నయ్యల ఆలనా పాలనా బాధ్యతలు కూడా అక్కయ్యకు అప్పజెప్పి వీరిని నీ పిల్లలుగా చూసుకో అంది అమ్మ.

పిల్లలకు తల్లి అంటే ఎనలేని ప్రేమ. అయినా చదువు నిమిత్తం సుబ్బారావు, రవి అన్నయ్యలు అప్పికట్ల గ్రామంలో ఉండాల్సి వచ్చేది. కాని, జిల్లెళ్ళమూడి అమ్మ సాన్నిధ్యాన్ని ప్రేమను పొందాలనే తహతహ. స్కూలు సెలవు దినా లయిన శని, ఆదివారాలలో జిల్లెళ్ళమూడి చేరటం అమ్మతో గడపటం చేసేవారు. ఒక్కోసారి వారికా అవకాశం కుదిరేదు కాదు. ప్రభావతి అక్కయ్య వారిని ప్రేమతో ఆదరించి రాత్రిళ్ళు తన ప్రక్కలో పరుండ చేసేది. అమ్మ చెప్పిన బాధ్యత కదా అది. అమ్మే అక్కయ్యా, పిల్లల మనసుల్లో అనుబంధాన్ని పెంచి వారినలా స్వాంతన పరిచింది. ఒక్కోసారి అమ్మను చూడాలనే బెంగతో బడి మానేసి పిల్లలు జిల్లెళ్ళమూడి చేరేవారు. ఇంటికి చేరిన పిల్లలు విషయం తెలిసి నాన్నగారు వారిని గట్టిగా మందలించేవారు. ఆయన మందలింపుతో పిల్లల బిక్కు బిక్కు మనేవారు. వారినలా చూసిన ప్రభావతి అక్కయ్య నాన్నగారితో ఏంటి బాబాయిగారు పిల్లల్ని మీరలా కేకలేస్తారు. వాళ్ళసలే అమ్మ మీద బెంగతో ఇక్కడికి వస్తే మీరలా వాళ్ళని మందలించటం ఏమీ బాగాలేదు. వారిని అలా అనకండి అనేది. ఆశ్చర్యం! ఆయన అందరితో ఎలా ఉన్నా ప్రభావతి మాటలకు బదులు మాట్లాడేవారు కాదు. ఇదంతా అమ్మ నిర్ణయంలో ఒక భాగమే అయినా అంత చిన్న వయస్సు నుంచీ ప్రభావతి అక్కయ్యకు తర్ఫీదు ఇచ్చి తన సేవ చేయించుకొని తరింపచేసిందని తెలియజేసేందుకే ఇంత వివరణ. అపుడపుడూ కొమ్మూరులో తల్లిదండ్రులను చూచేందుకు వెళ్ళినా ఎక్కువగా అమ్మ సేవలోనే అక్కయ్య గడిపేది.

1957 నుంచి చీరాల సోదరులు అమ్మ దర్శనార్థం రావటం ప్రారంభించారు. ప్రతి శని, ఆదివారాలలో వారు అమ్మని దర్శించి అమ్మతో సంభాషణలు సలిపేవారు. అమ్మ దర్శనార్హుల సంఖ్య క్రమంగా పెరగనారంభించింది. ఒక్కొసారి 40, 50 మంది దాకా అమ్మను చూడటానికి వచ్చేవారు. ఏ రోజు ఎంతమందికి వంటచేయాలో అక్కయ్య అమ్మనే అడిగేది. ఒక్కోసారి అమ్మ చెప్పేది. ఒకోసారి నీ ఇష్టం అనేది. ఒకరోజు ఆరోజు వచ్చిన వారికి అక్కయ్య వండి వడ్డించింది. అంతా తిన్నాక గిన్నెలో ఒక మనిషికి సరిపడా ఆహారపదార్థాలు వున్నాయి. సమయము 1 గంట దాటింది. అనుకోకుండా మరో 20 దాకా అమ్మ దర్శనార్థం వచ్చారు. విషయం అక్కయ్య అమ్మతో చెప్పింది. ఈ సమయాన ఎప్పుడు వండి వారికి పెడతావు. గిన్నెల మూతలు పూర్తిగా తీయకుండా గిన్నెల్లో పదార్థాలు అందరికీ వడ్డించమని అమ్మ ఆదేశించింది. 20 మందిని భోజనానికి పిల్చి అక్కయ్య అలానే చేసింది. అందరూ | తృప్తిగా తిన్నాక గిన్నెల మూతలు తీసి చూస్తే మరొకరికి సరిపోయే పదార్థాలు అలాగే ఉన్నాయి. ఇదెలా సాధ్యం అనే సందేహానికి అమ్మ సమక్షంలో అసాధ్యాలు సుసాధ్యాలే అనే సమాధానపడ్డది.

ఆ రోజులలో అన్నం తింటే బాగా ఆయాసం పెరిగి అక్కయ్యకి పనిచేయటం కష్టసాధ్యమయ్యేది. అలా అయితే అమ్మ సేవకు దూరం అవుతానేమో అనే బెంగతో కేవలం కాఫీలు తాగి కొన్ని సంవత్సరాలు అమ్మ సేవ చేయటం అక్కయ్యపై అమ్మ అనుగ్రహ విశేషం కాక మరేమిటి సామాన్యంగా అమ్మ రోజుకు 1, 2 సార్లు కాఫీ, బత్తాయి రసాలు తీసుకొనేది. ఇదే అమ్మ ఆహారం. ఎప్పుడూ ప్రత్యేకించి ఆహారం తీసుకోని అమ్మ అప్పుడప్పుడూ అక్కయ్యతో 1 మానెడు బియ్యం వండించి ఆహారాన్ని పెట్టించుకొని మొత్తం ఆశ్చర్యంగా తినేది. ఆ సమయాన అలౌకిక దృష్టితో పరికిస్తూండటం, మరో మారు సమాధి స్థితిలోకి వెళ్ళి “ఇంకా ఆహార సముపార్జన చేతకాకపోతే ఎలా” అని ఎవరినో మందలించేది. ఆ మందలింపులు ఎక్కడనో సుదూర ప్రాంతాలలో సాధనలు చేసుకొనే వారిని ఉద్దేశించినవి అని అక్కయ్యకు అవగతమయ్యేది. ఒక్కోసారి ఎక్కువ ఆహారపదార్థాలు విస్తళ్ళు పరచి వడ్డించమని అమ్మ ఆదేశించేది అక్కయ్య అలానే చేసేది. మనుషులెవరూ కనపడే వారు కాదు. కాని విస్తళ్ళలోని ఆహార కదలికలు, మనుషులు తింటున్న చప్పుళ్ళు తెలిసేవి. కొంతసేపటికి పదార్థాలు మాయం అయి ఖాళీ విస్తళ్ళు మిగిలేవి. అదృశ్యరూపంలో వున్న సిద్ధపురుషులెవరికో అమ్మ ఆహారం వీరిది. పెట్టించిందని ఆ తర్వాత అక్కయ్యకి అవగతమయ్యేది. మరొక సాయంత్రాన వంట చేయబోయేముందు అమ్మ దర్శనార్థం ఎవరైనా వస్తున్నారేమో చూచి మొదలెడదాం అని అమ్మ నివాసం ముందు నుంచొని ప్రభావతి అక్కయ్య చూస్తోంది. ఆమె కాలికేదొ కుట్టినట్లయింది. కుట్టిన చోట రెండవ కాలితో గోకింది. రెండవ కాలికీ కుట్టింది. ఒక కాలితో మరొకటి రుద్దుకుంటూ దృష్టి కాళ్ళ వైపు మరల్చగా కాళ్ళ ఒరిపిడికి ఒక తేలు చచ్చిపడి ఉంది. బాధపెరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ఎవరో అమ్మకి చెప్పారు. స్నానం చేసి కాఫీ తాగమనండి అదే తగ్గుతుందని అమ్మ వారిని సమాధాన పర్చింది. అమ్మ మాట పాటించిన అక్కయ్య ఏ మందూ, మంత్రం లేకుండా బాధ తగ్గి వెంటనే తన పనిలో నిమగ్నమయింది. అయితే తేలుకుట్టిన వారికెవరికైనా అలా చేస్తే తగ్గుతుందా ? అంటే, కాదు. అమ్మ చెప్పింది కనుక అట్లా జరిగింది. అమ్మమాటే మందూ మంత్రమూను.

ఒకోసారి అమ్మ సమాధిస్థితిలో రకరకాల భాషలతో సంభాషణలు సలిపేది. అది సుదూర ప్రాంతాలలో వున్నవారితోమాట్లాడుతున్నట్లు వుండేది. అక్కయ్యకు తెలిసినంతవరకు ఆ భాషలు తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు ఇంకా తెలియని అనేక భాషలలో ఆ సంభాషణలు ఉండేవి. భౌతికంగా అమ్మ ఎన్నడూ ఏ స్కూలుకి వెళ్ళలేదు. ఏ ఏమీ చదువుకోలేదు. అనర్గళంగా ఆ స్థితిలో ఆయా భాషాలలో అమ్మ సంభాషణలు సలుపుతుంటే దీనికంతకూ సాక్షీభూతంగా వున్న అక్కయ్య విస్తుబోయేది. తర్వాత ఆశ్చర్య ఆనందాలకు లోనయ్యేది. తర్వాత అమ్మతో విషయాలు  ఆ ప్రస్తావిస్తే తెలుగు కాక తనకే భాషలూ తెలియవని ప్రస్తావన మార్చేది.

ఇలా జిల్లెళ్ళమూడిలో అమ్మ సాన్నిధ్యంలో అమ్మ సేవలో ఆనందంగా అక్కయ్య జీవితం సాగుతుంది. 1958 సంవత్సరంలో బావమరదళ్ళయిన రాజుబావ ప్రభావతి అక్కయ్యలకు అమ్మ సమక్షంలో వివాహం జరిగింది. ఆ తర్వాత కళ్యాణకారిణి అయిన అమ్మకరములతో అనేక వందల కళ్యాణాలు జరిగాయి. అమ్మ దివ్యకరములతో జిల్లెళ్ళమూడిలో అమ్మ నిర్వహించి చేసిన తొట్టతొలి కళ్యాణం వీరిది. 

1958 మార్చి 30 తేది వీరి వివాహం జరిగితే 1959 డిసెంబరు దాకా తానెక్కడో ILTD లో ఉద్యోగంలో వున్నా, ప్రభావతి అక్కయ్యను మాత్రం రాజుబావ అమ్మ సేవలోనే ఉంచారు. కాపురానికి తీసుకొని వెళ్ళలేదు. కొన్ని సంవత్సరాలుగా అమ్మ గర్భవాసాన జన్మించిన బిడ్డలతో అక్కయ్యకు విడదీయలేని బంధం ఏర్పడింది. అక్కయ్య దూరం అయితే ఆ పిల్లలు తట్టుకోలేరనే భావనతో 1959 డిసెంబరు దాకా ప్రభావతి అక్కయ్య రాజుబావ అనుమతితో అమ్మ సేవలోనే ఉండిపోయింది. 1959 డిసెంబరు చివరిరోజులలో అమ్మ అనుమతితో ప్రభావతి అక్కయ్య రాజుబావతో కాపురానికి వెళ్ళింది.

ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలూ, ఒక మగపిల్లవాడు జన్మించారు. పిల్లలు పుట్టిన 6 నెలలకి అమ్మ చేత వారికి నామకరణం చేయించి ఆ తల్లి చేతులమీదుగా పిల్లలని మొదటిసారి అందుకోవటం రాజుబావ ఆనవాయితీ. ఆడపిల్లల పేర్లు వరుసగా సుహాసినీ సుభాషణి, హైమ (శైలజ) అనీ, మొగపిల్ల వాని పేరు ప్రేమకుమార్ బాలకృష్ణ శర్మ అనీ అమ్మ పెట్టింది.

అమ్మ ఆశీస్సులతో అమ్మ సేవలో తరించి ఆమె అనుజ్ఞతో సంసారజీవితం సాగించి నలుగురు బిడ్డలకు తల్లియై వారిని యోగ్యులుగా తీర్చిదిద్ది, భర్తసేవలో పునీతమై ప్రభావతి అక్కయ్య తన 70వ ఏట 08-01-2012 అమ్మ సాన్నిధ్యాన్ని కోరి తిరిగి అమ్మను చేరింది. తను అవతరించే సమయాన ఈ భువిపైకి తనతో తెచ్చుకొన్న అమ్మ పరివారంలోని ఒక సోదరిని తిరిగి అమ్మ తన దగ్గరకే పిలుచుకొంది. హైదరాబాద్ లో దహనసంస్కారాలు అనంతరం రాజుబావగారు ఆయన కుటుంబసభ్యులు తదితర బంధువులు 9, 10, 11, 12 రోజులలో జరిగే కార్యక్రమాలు అమ్మ సమక్షంలో చేశారు. రాజుబావగారి కొడుకూ, కోడలూ అనసూయేశ్వరాలయంలో అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా 9, 10, 11 రోజులలో రాజుబావ తాను రచించిన అనుభవసారంలోని అన్ని పాటలు అనసూయేశ్వరాలయంలో పాడి అమ్మకు నివేదించారు. 12రోజు కుటుంబసభ్యులకూ, బంధువు లందరికీ అమ్మ ఆశీస్సులతో కూడిన నూతన వస్త్రాలు పరిషత్కారు ఏర్పాటు చేశారు. ఆరోజు సాయంత్రం 3-30ని. ప్రభావతి అక్కయ్య సంస్మరణ సభ జరిగింది. శ్రీశ్రీ పి.యస్.ఆర్. గారు అధ్యక్షత వహించారు. ఆ సభలో రవి అన్నయ్య తన చిన్ననాటి స్మృతులను వివరిస్తూ, ఆ జ్ఞాపకాలలో అక్కయ్య ఔన్నత్యాన్ని హృద్యంగా వివరించారు. ఎమ్. దినకర్, వై.వి. శ్రీరామమూర్తి, మన్నవ దత్తాత్రేయశర్మ, రాజుబావ, రావూరి ప్రసాద్ తదితరులు అక్కయ్యలో తాము గుర్తించిన విశేషాలను వివరించారు. అక్కయ్యను అమ్మ తన ఒడిలోకి తీసుకొంది. ఆమె ధన్యురాలు. ఆమెలేని లోటును జగజ్జనని వారి కుటుంబ సభ్యులకు తీర్చి వారిపై శుభాశీస్సులు సదా వర్షించ గలందులకై సదా అమ్మను ప్రార్థిస్తూ….

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!