1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ప్రెసిడెంట్

ప్రెసిడెంట్

N Ramadevi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : July
Issue Number : 12
Year : 2013

ఇదొక గౌరవప్రదమైన హుందాతనానికి, అణుకువకు అందరికి సమానంగా వుండాలనే భావనతో అలరించే పదవి. దీనినే తెలుగులో అధ్యక్షుడు అని అంటారు. ఆర్థిక, సామాజిక, విద్యావిషయక, వ్యవహారం, పెద్దరికం, ప్రేమతో జీవులను, అలరించే వ్యవహారం అని చెప్పవచ్చు.

నన్ను ఉద్దేశించి ‘అమ్మవారు’ ఒక సమయంలో నీవు ప్రెసిడెంట్గా వుంటే బాగుంటుందని అన్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం తెలియని నేను ఆ పదవికి ఏ విధంగా అర్హురాలిని ఔతానని. ప్రశ్నించుకుంటే మనలోని దృష్టికి భేదం లేనిచో, ఆ భేదం లేని చూపే. ఆ పదవికి అర్హుల్ని చేస్తుందని సమాధానం చెప్పుకున్నాను. నాకు నేనే – మనం ఎలాంటి వారమో తెలిసిన స్త్రీమూర్తికి లోపలి సరకు గురించి ఎరిగిన పుణ్యమూర్తి ఆమె చంచల మనస్కులం, పైపై మెరుగులకు తళుకు బెళుకులకు ఆకర్షితులం అయ్యే దుర్బలులం లోపలి గూడు లోకి వెళ్ళేది ఆమె అమ్మ మాత్రమే. ఇదేదో Central Govt. State Govt కాదు.

మాతృ Govt – Place మహత్వం అంటారు. ఇక్కడ Govt – మాతృప్రేమ. God Mother House Add . అందరిల్లు ఇదొక విశిష్టమైన వినూత్నమైన సంస్థ – మనకొరకే సంస్థను ఏర్పాటు చేసింది. అంతేకాని – సంస్థను ఏర్పాటుచేసి మనల్ని రప్పించుకోలేదు. ముఖ్యమైన గుర్తుంచుకోవలసిన విషయం. గుర్తుంచుకోకపోవటం అది మీ ఖర్మ. అమ్మ – మనమందరం సంస్థ – ఇది అమ్మ యొక్క పటిష్ఠమైన ప్రణాళికబద్ధమైన సిద్ధాంతం. కొంక్రొత్త సిద్ధాంతాలను ప్రకటించకండి. రాద్ధాంతం చేయకండి. మాతృయాగం. పితృయాగం. అదేదో ఇదేదో మరేదో మరింకేదో రకరకాల ప్రతిపాదనలతో అమ్మను ఏమేమో చేసేశారు గ్రామమంతా. అమ్మదే కాని అమ్ముకొని వూరేగే గ్రామం కాదు. అదేమి వ్యాపార కేంద్రం కాదు. బిజినెస్ తో వూరేగే వ్యవహారం కాదు. వ్యక్తిత్వ వికాసకేంద్రం. అంతా అయిపోయి చేతిలో చిల్లి గవ్వలేక నెత్తిన ముసుగేసుకొని అరుదెంచిన సమయంలో అందరిల్లే శరణ్యం అంటూ వుంటే కన్నీరు తుడిచి వేసే జాబిల్లి లాంటి స్త్రీమూర్తికి నెలవైన పుణ్యస్థలం. ఆ మహారణ్యంలో శ్రీయుతులు ఆడంబరాలులేని నాన్నగారి చిటికిన వేలు పట్టుకొని మృదుమధురమైన పాదాలతో ఆ ప్రదేశానికి వేంచేసింది. ఎక్కడో ఆకాశమార్గంలో పయనించే దేవతకు భూలోక నివాసం చేద్దామనే తళుక్కుమనే సంకల్పమే ఈనాటి ఈ గ్రామానికి పట్టిన మహర్దశ. అది ఇంతింతై వటుడింతై అన్న చందాన విస్తరించి భూలోకమంతా మారుమోగి పోతోంది.

ఆ భయంకర పిశాచక రూపమైన నల్లమడ డ్రైన్. అమ్మ పాదస్పర్శతో, పాపవిమోచనం కల్గి ఓంకారనదిగా మరి అనేక లక్షల ఎకరాలకు సాగుపడి నీరైంది. గ్రామాలన్నీ ముంచి వేయగల్గిన ఆ డ్రైన్ ఇప్పటివరకు ఒక్క ప్రాణికి కూడా హాని కలగలేదంటే ఓహో ఎంత ఆశ్చర్యం. అమ్మ యొక్క సాంగత్యమహిమే. ఆమె కాపాడినదని తెలిసిన అందరూ మాదే గొప్పతనం అని అనుకొంటున్నారు. ఆ డ్రైన్ హాని తలపెడ్తా అమ్మ వూరుకొంటుందా ? జీవనదిగా మార్పు చెందిన పుణ్యమూర్తి.

ఆ కొనగోటితో కుంకుమలను నుదిటిన అలంకరించుకొన్నవారు, నేటి సభ్యసమాజంలో ఎంతెంత గొప్పవైన స్థానాలను చేపట్టి పీఠాధిపతులు, మఠాధిపతులు, సైన్యాధిపతులు, యోగులు, మహర్షులు, ధైర్యాధిపతులు స్వర్ణకంకణధారులుగా అనేకమందిచే కొనియాడబడుతూ అమ్మ నడిచే బాటలోనే మేము నడుస్తాం. అంటూ దేశసేవకంటే మాతృసేవే ముఖ్యంగా భావించి తరించి పోదామనే ఉత్సాహంతో గుండిగల భాండాగారాల చరిత్రను వ్యాపింపచేస్తున్నారు. వారందరికి అందరి తరఫున ధన్యవాదాలు. వారందరికి అమ్మ దివ్యభవ్యమైన ఆశీస్సులను యిస్తారు. కొనగోట మీటిన చాలు కోటిరాగాలు పలుకుతై అన్న చందాన అమ్మ చూపుడి వేలు ముద్రలు అలాంటివి.

నాన్నగారి పుణ్యమా అని ఆ గ్రామానికి అంతటి వైభోగం వస్తే – భక్తులం అనే పదాన్ని నెమరేసుకొంటూ,అందరూ బిడ్డలేనని అనుకొంటూ ముసుగేసుకొని ఎంచక్కా వూరంతా కొనేసుకొని వూరేగడం ఏమిటి? అనసూయా – అనసూయా – అనసూయ – అనసూయా – నీవెవరో – నీ పేరమిటో – నీ రీతిఏమిటో – నీ రాకడ పోకడలు ఏమిటో. నీదేశమేమిటి? నీ కాలగమనం ఏమిటి ? నీవు అసలు ఎవరివి ? అందరిల్లు అంటావు. అంతా నేనేనని అంటావు. అందరికి అమ్మనే అని అంటావు. ఈ కారాడవియే నీకు మార్గమయ్యేనా.. అంత పసికూనవు. అంతసున్నితానివి – మరి ఎంతెంత అందానివి. ఈ చిట్టి పొట్టి కుగ్రామమే – నీకంత మరీ మరీ యిష్టమైందా?

అమ్మవాక్కు వేదవాక్కు.

  అమ్మ బాట ముళ్ళబాట.

అమ్మ మనస్సు అందాల హరివిల్లు.

అమ్మరీతి full Democracy → స్వేచ్ఛ

అమ్మకు యిష్టం చేతగాని అసమర్థులం.

అమ్మకు స్నేహితులు మనలాంటి అందరం

అమ్మ తత్త్వం — అన్నంలోనే వున్నది అంతా

అమ్మకు అవసరం లేనిది – ఈ జగత్తు.

అమ్మకు అవసరం ఐంది ఈ జగత్తే.

మొత్తం అంతా అమ్మ బ్రహ్మ పదార్థం.

ఎవరి యాజ్ఞకు బద్ధులో – ఎవరో ప్రభువో

ఎవరి యానతి ఇది ఎల్ల ఇట్లు జరుగు

అతడె ఇతని, ఇతడె అతడని.

సర్వుల కధిపతియని కాంచరయ్య !

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!