అమ్మే పరమేశ్వరుడు – అమ్మే పరాశక్తి శివ శక్త్యాత్య స్వరూపమే అమ్మ. మరి అమ్మను చుట్టుకుని వున్నది నాగేశ్వరుడే కదా!! అమ్మ కొలువైన అర్కపురి సాక్షాత్తూ కైలాసమే. బాలా త్రిపురసుందరి, మహాగణపతి, కుమారస్వామిల సమైక్య తేజోరూపంతో భాసిల్లుతున్న హైమవతీదేవితో కూడిన విశ్వకుటుంబమే జిల్లెళ్ళమూడి.
విశ్వవ్యాప్తమయిన మాతృప్రేమ రూపం ధరించి వెలసిన వైకుంఠధామమే జిల్లెళ్ళమూడి. పదివేల పడగల ఆదిశేషుని చల్లని నీడలో సాక్షాన్మహాలక్ష్మి, శుద్ధ సత్త్వస్వరూపిణి హైమమ్మ వెలసిన ఆనందనిలయమే అర్కపురి.
చిమ్మద్ర దాల్చిన జ్ఞాన స్వరూపిణి హైమమ్మ. వాగర్థ స్వరూపులైన అమ్మ, నాన్నగార్లతో కలసి అవిద్యా రాన్ని అంతర ద్వీపనగరమే అర్కపురి.
“వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసియైన పెద్ద ముత్తైదువ” అమ్మ. “అర్కపురీ హాటక పీఠ శిఖాధిరూఢ, ఆదిమశక్తి” అన్నపూర్ణమ్మ. కడుపు నింపే కన్నతల్లి మన అమ్మ. అమ్మ సన్నిధిలో సహజవైరం మాని ప్రేమభావంతో మసలిన జంతువులను చూశాం. అకారణ నిష్కల్మష ప్రేమాభిమానాలతో తన్మయులై పరవశించిన సోదరీ సోదరులను చూశాం. ప్రకృతి శక్తులు అమ్మ కనుసన్నలకు లోబడి ప్రవర్తించటం చూశాం. అసాధ్యాలను హేలగా, లీలగా, అతి సహజంగా సుసాధ్యాలను చేసిన అమ్మ లీలలను కనులారా తిలకించాం.
చరిత్ర ఎరుగని అపూర్వ ప్రేమైకమూర్తి అమ్మ అవనిపై అవతరించి నూరు వత్సరములు కావస్తున్నది. అంతటి మహోన్నత ప్రేమ స్వరూపిణి శతజయంతి ఉత్సవాలు ఎంత ఉత్సాహంగా, పాదరంగా, | | అంగరంగ వైభవంగా జరుపుకోవాలి!! అమ్మ పాదాల ముందు మోకరిల్లి మన ప్రేమపూర్వక కృతజ్ఞతా సుమమాలను అమ్మ గళసీమనలంకరింప చేయాలి. అందుకు ఎంతో సమయం లేదు. తరుణం మించితే మళ్ళీ రాదు. అందరూ సమైక్యభావంతో, ఏక లక్ష్యంతో కార్యోన్ముఖులు కావలసిన తరుణమిది.
శ్రీ శోభకృత్ నామ సం.రం 1-4-2023 న అమ్మ శతజయంతి ఉత్సవం. ఆ సందర్భంగా మనందరం కృతజ్ఞతాపూర్వకంగా అమ్మను ఒక్కొక్క పుష్పంతో అర్చించుకోవాల్సి ఉంది. అందరం స్నేహపూర్వకంగా చేయి చేయి కలుపుకుని సేవాకార్యక్రమాల్లో పాల్గొందాం.
జిల్లెళ్ళమూడిలో SVJP నిర్వహించే కొన్ని కార్యక్రమాలు:
- అమ్మ నివసించిన అందరింట్లో వాత్సల్యాలయానికి కొన్ని మరమ్మత్తులు చేపట్టాల్సి ఉంది. 1960లో మన సోదరీసోదరులు శారీరక కష్టంతో నిర్మించిన అపూర్వభవనం. శారీరక శ్రమ తెలియని మాన్య సో॥ శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు వంటి వారందరూ శ్రమించి అమ్మకు సమర్పించిన ప్రేమపుష్పం, కానుక అది. ఈ భవనంలో అమ్మ 2. దశాబ్దాలు నివసించింది. అమ్మ కనుమరుగై 96 ఏళ్ళు గడిచాయి. అమ్మ దర్శనస్పర్శన సంభాషణాది మహద్భాగ్యాన్ని పొందిన మహనీయులు ఒక్కొక్కరే అమ్మ ఒడిలోకి చేరుకుంటున్నారు. అమ్మ ప్రేమామృతాన్ని అనుగ్రహాన్ని పొందిన మరికొందరు వృద్ధాప్యదశలో ఉన్నారు. ఇప్పుడు ఈ బృహత్కార్యాన్ని మనం ఎలా నిర్వహించుకోవాలి. అంటే యువత భాగస్వామ్యంతో, వాత్సల్యాలయ మరమ్మత్తులకు సుమారు రు 20 లక్షలు ఖర్చు అని అంచనా. ఆ పని మొదలు పెట్టాం, అది పూర్తికావస్తోంది.
- అమ్మను సందర్శించుకునే యాత్రికులు, అతిథుల సౌకర్యార్ధం కనీస ఆధునిక సౌకర్యాలతో 24 గడుల అతిథి గృహాన్ని (Guest House) నిర్మించుకోవాలని దానిని 2022 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ఆకాంక్ష.
- అమ్మ శతజయంతి ఉత్సవ స్మారక స్తూపాన్ని నిర్మించుకోవాలని. తొలిరోజుల్లో జమ్ములపాలెం నుంచే అమ్మ నివసించే భవన ఉపరిభాగం, దీపం కనువిందు చేసేవి. తిరుగు ప్రయాణంలో అమ్మ మనకి వీడ్కోలు పలుకుతూ ఆ సౌధోపరిభాగన్నుంచే చేయి ఊపుతూండేది. అది 7వ మైలు దాకా కనిపించేది. కారణాంతరాలవలన ఆ కమనీయదృశ్యం నేడు మనకు కనపడటంలేదు.
అమ్మ నివసించే భవనం ఎక్కడినుండి చూసినా కనిపించేట్టుగా వుండాలి. అందుకు 100 అడుగుల ఈ స్తూప నిర్మాణం. అందుకుగాను 30/40 లక్షల రు.ల వ్యయం అని అంచనా.
ఈ కార్యక్రమాలన్నింటిలో మీరందరూ నిండు మనస్సుతో సహకరిస్తారని శ్రీ విశ్వజననీ పరిషత్ తరపున అభ్యర్థిస్తున్నాను.