ఆగష్టు 23వ తేదిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అమ్మ అంతరంగిక కార్యదర్శి శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య వర్ధంతి సభ జరిగింది. శ్రీ కొండముది రామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ అన్నయ్యకు ఘనంగా నివాళులు అర్పించింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుబ్రహ్మణ్యేశ్వరశాస్త్రిగారు, తమ అధ్యక్షోపన్యాసంలో కళాశాల ప్రగతికి రామకృష్ణ చేసిన సేవలను కొనియాడారు. అమ్మ సాహిత్యస్రష్టగా అన్నయ్య ప్రతిభను శ్రీ విశ్వజననీపరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కె.బి.జి. కృష్ణమూర్తిగారు హృద్యంగా ఆవిష్కరించారు. పరిషత్ నిర్వహణలో అన్నయ్య అంకితభావాన్ని కార్యదర్శి శ్రీ నాదెండ్ల లక్ష్మణరావుగారు స్ఫూర్తిదాయకంగా వివరించారు. అమ్మసేవలో అన్నయ్య జీవితం సార్ధకమైన తీరును ఉపాధ్యక్షులు శ్రీ ఎం.దినకర్గారు పేర్కొన్నారు. . అన్నయ్య సేవలు అందరికీ ఆదర్శమని ఉపాధ్యక్షులు శ్రీ రాజేంద్రప్రసాద్ గారు వివరించారు. అన్నయ్య రచన “నీ సేవలోనే” అనే మధురగీతాన్ని డాక్టర్ పి. ఝాన్సీలక్ష్మిబాయి గారు ఆలపించారు.
సభలో శ్రీ రామకృష్ణా ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ బి. శాంతారాంగారు, సభ్యులు శ్రీ కె. ప్రేమకుమార్ గారు, శ్రీ కె. రవిప్రసాద్ గారు, శ్రీ బి. శ్యాంప్రసాదముఖర్జీగారు, శ్రీ కె.ప్రసాదరావుగారు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ మల్లాప్రగడ సభను ప్రశాంత సుందరంగా నిర్వహించారు.