ఈ బ్రహ్మాండములో
ప్రతి అణువు కదిలేది
ఆదిశక్తి ఆజ్ఞతోటే
ఆదిశక్తి లేనిదే అడుగులు వేయనులేవు.
అడుగులు వేయనిది అంబను
చూడను లేవు, అంబ అంటే
ఎవరని అనుకొంటారా!
అమ్మతత్త్వమును పంచే
అనురాగమూర్తి, అంతులేని
జయపరాత్పరి అమ్మ
అమ్మలోని అమ్మతనమును
మధురమైన మనసులతో
తియ్యనైన భాషణముతో
పంచవచ్చే మధురమీనాక్షి అమ్మ!
ఆలయము అనుకొన్న వారికి అది ఆలయం
ఒడి అన్నవారికి అది చల్లగ
సేదతీర్చే అమృతహృదయము
శరణము అంటు చరణాలు పట్టిన
కాదు పొమ్మని తిరిగి పంపే
కఠినమైన శిలకాదు అమ్మ
కమ్మనైన మనస్సున్న అమృతవల్లి అమ్మ !
అనురాగమూర్తి అనసూయమ్మ.