సాకీ…
ఓం జిల్లెళ్ళమూడి అమ్మ.. అనసూయమ్మ
వంద వసంతాల తల్లి వందనం కల్పవల్లీ
పల్లవి…
జిల్లెళ్ళమూడి అమ్మ కరుణించమ్మా
జగదేకమాత కనికరించమ్మ
కోరిన వరములియ్య వేడితిమమ్మ
కొంగుబంగారమై జన్మించినావమ్మ
గుండెను కోవెల చేసితిమే
కుంకుమ పూజల కొలిచితిమే
జయ జగదీశ్వరి అఖిలాండేశ్వరి జిల్లెళ్ళమూడి శ్రీ మాత్రే నమః
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గను పోలి
చంద్రశేఖర సతి పార్వతి వలె తెలిసి
అభయ మొసగి జగము నేలి
కాశ్మీర శిఖరాన వైష్ణోదేవివై
భారతి పాదాన కన్యాకుమారివై
త్రేతాయుగమున జానకిపై ద్వాపరయుగమున రుక్మిణివై
ఈ కలియుగమున అనసూయమ్మ నీవేనమ్మా….
విరించికి చెంతగ నిలిచే వీణాపాణి
హరి హృదయాన నీవే సిరి శ్రీ లక్ష్మి
పద్మప్రియ …. పద్మహస్తా…..
ఆలంపుర జ్యోతి జోగులాంబవే తల్లి
కలకత్తపురిలోన కాళికాంబ జనయిత్రి
పరిపాలించే పెద్దమ్మ …..
భక్తుల బ్రోచే జగదాంబ….
భవతారిణీ శాంత స్వరూపిణి
ముగురమ్మల మూలపుటమ్మ
జయము జయము అనసూయమ్మ…
జిల్లెళ్ళమూడి అమ్మ కరుణించమ్మా!
జగదేకమాతా కనికరించమ్మా!