“మంగళప్రదమైన ఆకృతి గల శ్రీమాత “మంగళాకృతి?”. ఆమె దివ్యమంగళ విగ్రహ. ముల్లోకాలకూ ఎల్లకాలమూ ఆమె రూపం శుభప్రదమే”
– భారతీవ్యాఖ్య.
మంగళమంటే శుభము, క్షేమమని అర్ధం, మంగళమైన ఆకృతి గల శ్రీమాత ‘మంగళాకృతి’, ఆమె ప్రకటాకృతి’, ‘హవనాకృతి’: వివిధ రూపాలతో ప్రకటిత మవుతూ, మనల్ని పావనం చేసే ‘మంగళాకృతి’ శ్రీలలిత. ‘శ్రీమాత ‘శుభకరి’, ‘శివంకరి’, కనుక ఆమె ‘మంగళాకృతి’. ఎవరిని దర్శించినంతనే మనకు సర్వ శుభములూ, సకల సౌభాగ్యములూ కలుగుతాయో ఆమె ‘మంగళాకృతి’. అమ్మవారి దర్శనభాగ్యం కలిగిన జన్మధన్యం.
“అమ్మ” – ‘మంగళాకృతి’, ‘అమ్మ’ అంటే ఎవరండీ”అమ్మగారి విశేషమేమిటండీ’ ఇది జిల్లెళ్ళమూడి “అమ్మ”ను గురించి తెలియనివారు వేసే ప్రశ్నలు. నిజమే! ఎవరీ “అమ్మ’? ‘ఒక అబల సామాన్య మానవాంగన. రెండే కాళ్ళు, రెండే చేతులూ, ఒకే తల’ కలిగి మనందరి వలె కనిపించే సాధారణ రూపమే “అమ్మ”. అవునా! అంతేనా! అంటే కాదు. “అమ్మ” ఒక అనంతశక్తి, ఒక అద్భుతవ్యక్తి. నిత్యనూతన చైతన్యదీప్తి శ్రీకృష్ణలీలలు ఎంత విచిత్రమో, అమ్మ లీలలు అంత చిత్రాతి చిత్రం
ఈ ”మంగళాకృతి’పుట్టి పుట్టగానే గోల్లనగమ్మకు తన నాభి కుహరంలో పద్మాలయగా సాక్షాత్కరించిందా! పసితనంలోనే చిదంబరరావు తాతగారికి దర్శనమిచ్చిందా! “అమ్మ” వీరికి ఎన్నో దర్శనాలు అనుగ్రహించింది) రాజ్యలక్ష్మి గుడిలోని అర్చకస్వామికి ‘తేజోవిలసితము, రమణీయమూ అయిన ఆ ముఖము, నేత్రద్వయమూ తలుకుమనిపించి, మురిపించిందా? లక్ష్మణాచార్యులు గారికి, బాలా త్రిపుర సుందరిగా కనిపించి, కనువిందొనరించిందా ఏమి వారి భాగ్యం.
”మంగళాకృతి’ అయిన “అమ్మ” నిర్మాణా కల్యాణస్వరూపిణి, కల్యాణదాత్రి, అనంత కళ్యాణ గుణ కర్మా సంభరిత’, అందుకే పులిపాక చలపతి రావు తాతగారు ‘ఏమిటి అతిశక్తి” అని ఆశ్చర్యపోయారు. అమూర్తిలో ఎంత ఆకర్షణశక్తి లేకపోతే – ఆమె సన్నిధి లో అనిర్వచనీయ ఆనందాంబుధులు పొంగిపొతాయి. ఎందుకు ? ఒకసారి “అమ్మ”ను చూసినవారు మళ్ళీ ఆ మూర్తిని దర్శించాలని తపనపడతారు. సన్నిధిలోనే ఉండిపోవాలని, ఇంకా ఇంకా క దగ్గరగా అవ్వాలనీ, ఆమె పాదసంసేవనం ఎందుకు ఉవ్విళ్ళూరుతారు. ఎందుకంటే – ఆ తల్లి ‘మంగళాకృతి’ కనుక.
“అమ్మ” పాదాలపై ఒక్క క్షణం మన దృష్టి చాలు, మన సమస్త నాడుల్లోనూ నూతన చైతపు వెల్లి విరుస్తుంది. మన మనస్సులు పవిత్రమై మన జీవితం ధన్యం అనే అనుభూతి కలుగుతుంది. “అమ్మ” పాదాలకు మన నుదురు తాకితే చాలు. మన లోలోపల డ్డగి ఉన్న శక్తులు ఒక్కసారిగా మేల్కొంటాయి. మన చేత్తో పాదాన్ని తాకితే చాలు’ నడిసంద్రాన మునిగిపోతున్న వాడికి బలమైన చేయూత దొరికినంత ఆనందం కలుగుతుంది. అవి పాదాలా? కావు, కోరిన వరాలనిచ్చే కల్పతరువు మృదుపల్లవములు.
“అమ్మ” చేతి సౌందర్యాన్ని ఏమని వర్ణించగలం. దేనితో పోలిక చెప్పగలం. ‘పద్మం, నవనీతం, బంగారం’. వంటిది ఆ చేయి అందామా! అంటే వాటికి లేని మమత, సమత, అనురాగం, ప్రేమవంటివి ఎన్నో ఆ చేయి మనకు అందిస్తూ, వాటిని చులకన చేస్తోంది. ‘ఆ చేయి తాకినంతనే ఎందరో పునర్జీవితులు అయ్యారు. మరెందరో ఆరోగ్యవంతులయినారు. ఇంకెందరో సన్మార్గ వర్తనులుగా మారారు. ‘ఆ చేతిలో సంజీవని ఉన్నది. ఆ చేతిలో అమృతకలశమున్నది. ఆ చేతిలో అభయముద్ర ఉన్నది’ అవును. ఆ చేతిలో లేనిది ఏమున్నది?
“అమ్మ” సులోచన. పద్మాక్షి, మీనాక్షి. “అమ్మ” కళ్ళు ప్రశాంతి నిలయాలు. ప్రేమామృతసాగరాలు. “అమ్మ” చూపులు సూటిగా మన హృదయంలోకి చొచ్చుకు పోయే నిశితమయిన తూపులు. ఆ చూపులు అభయప్రదాతలు. “అమ్మ” చూపు ‘అపూర్వమయినది, అనన్యమయినది, అతిలోకసుందరమయినది”. “అమ్మ” చూపు ‘లోచూపు’ కలిగినది.
“అమ్మ” దర్శనంలోనే ఒక మహత్తు ఉన్నది. “అమ్మ” దర్శనంలో మనకు అర్థం కాని, మనకు కనిపించని ఒక చికిత్సా ప్రక్రియ ఉన్నది. ఒక దివ్యౌషధ మున్నది. “అమ్మ” సన్నిధిలో మన మనస్సు నిర్మల గా భాసిస్తాయి. మవుతుంది. మన మనస్సు మూగవోతుంది. మనలోని అహంకారం అణిగిపోతుంది. మన అ ల్పత్వం మనకు అర్థమవుతుంది. ఆ దివ్యదర్శనమే సర్వార్థ సాధకం’.
“అమ్మ” స్పర్శ ‘దివ్య అనుభవప్రదం. “అమ్మ” సన్నిధిలో మనలోని చింతనలు, కామనలు, వాసనలు అణిగిపోతాయి. అంతవరకూ మనల్ని కలవరపరిచే ప్రశ్నలూ, సమస్యలూ, బాధలూ కరిగిపోతాయి. మనస్సు నిర్మలమై ఆనందానుభూతిలో ఓలలాడుతుంది. ఆమె సన్నిధిలో లోకస్మృతి ఉండదు’. అందుకే “అమ్మ” అంటుంది – “నన్ను చూడడమే పుణ్యం” అని.
“అమ్మ”ను ఆరాధించేవారు తలా ఒక రకం. “అమ్మ”ను దర్శించి, తన్మయులవుతూ ఉంటారు కొందరు. నామసంకీర్తనతో పరవశించి పోతారు మరికొందరు. పూజచేసి పులకించేపోయేవారు ఎందరో. “అమ్మ” దైవమని నమ్మి, “అమ్మ” దర్శనమే పుణ్యప్రదమని ఆబాలగోపాలం కంటికి రెప్పవేయకుండా “అమ్మ”నే చూస్తూ గంటలకొద్దీ ఆ లాగే కూర్చుండిపోతారు. “అమ్మ” రూప వైభవ సందర్శన భాగ్యాన్ని పరమప్రయోజనంగా భావించేవారు ఎందరెందరో.’
“అమ్మ” రూపం అపురూపం.
“అమ్మ” వాక్కు అతి మధురం.
“అమ్మ” ఆలోచన అనిర్వచనీయం.
“అమ్మ” క్రియలు మనకు కరదీపికలు.
“అమ్మ” జీవితమే మానవాళి కొక ఆదర్శం.
‘అందుకే “అమ్మ” సర్వజనారాధ్య అయింది.’
నిత్యం “అమ్మ”ను స్మరించడం, దర్శించడం, పూజించడం, “అమ్మ”ను గురించి అధ్యయనం చేయడం, ఆలోచించండంతో ఆగిపోక, ఆ మహనీయ గుణాలను, లక్షణాలను మనలోనికి ఆహ్వానించుకుని, ఆచరించి నట్లయితే’ ఆ ‘మంగళాకృతి’ దర్శన, స్పర్శనాదులు మనకు శ్రీకరములు, శుభకరములు, మంగళకరములు గా భాసిస్తాయి.
అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వ రాలయ అధీశ్వరి మాతృశ్రీ అనసూయా మహాదేవి మంగళాకృతిని దర్శిస్తూ, స్మరిస్తూ, భజిస్తూ తరిద్దాం. జయహోమాతా !
కృతజ్ఞతాంజలి : ఈ వ్యాసరచనకు నాకు ఎంతో ఉపకరించిన గ్రంథం “మాతృ సంహిత”. ఆ గ్రంథం లోని నాకు నచ్చిన వాక్యాలను యథాతథంగా స్వీకరించాను. ఆ గ్రంథ రచయిత మాన్యులు కీ.శే. శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్యగారికి నా హృదయ పూర్వక నమస్సులు సమర్పించుకుంటున్నాను.