ఆదిరాగం- మధ్యమావతి
మంగళమనరే మన అనసూయకు
హారతులీరే – ఆది జననికిని
- మన్నవ వంశోద్ధర్తికి – మాతకు
బ్రహ్మాండ – వంశపావనికి
అందరికిని మరి సుగతిని చాటిన
అఖిలాండేశ్వరి – ఆనందరూపికి
॥మంగళ॥
- సర్వ సమ్మతమె తన మతమంటూ
సర్వజీవులను తన రూపమెయను
సకల చరాచర జగద్ధాత్రికిని
సంతత శ్రీ నాగేశగేహినికి
॥మంగళ
- జనన మరణముల శాసన కర్ణికి
జీవిత జీవన సకల ప్రదాత్రికిని
జడచేతనముల పాలిత జననికి
జిల్లెళ్ళమూడి నిత్యనివాసికి