జిల్లెళ్ళమూడిలో జులై 23, 24 తేదీల్లో యాగశాలలో ‘మహాసరస్వతీ హెూమం’ సంప్రదాయోక్తంగా వైభవంగా జరిగింది. శ్రీ విశ్వజననీపరిషత్ టెంపుల్స్ ట్రస్టు ఈ కార్యక్రమాన్ని దీక్షగా నిర్వహించింది. 22వ తేదీ | సాయంత్రం కలశస్థాపనతో ప్రారంభమై, 23వ తేదీ ఉదయం ‘గణపతిపూజ, షట్పాత్ర ప్రయోగము, ఆ తరువాత మేథాసూక్తం సరస్వతీసూక్తం ఇత్యాది కృష్ణయజుర్వేదీయ మంత్రాలతో గోఘృతం, తెల్ల ఆవాలు, తెల్ల నువ్వులు, అష్టద్రవ్యాలు మున్నగు హెూమద్రవ్యాలతో హెూమం జరిగింది.
ఈ రెండు రోజుల క్రతువులో శ్రీ బూదరాజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, శ్రీమతి బూదరాజు వాణి, శ్రీవారణాసి ధర్మసూరి, శ్రీ రాచర్ల రహి, శ్రీమతి రాచర్ల సుధ, చి. రఘురామ్, శ్రీ వి.భాస్కరశర్మ, శ్రీమతి కస్తూరి, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ, శ్రీమతి యనమండ్ర సుబ్బులు, శ్రీ ఎమ్.వి.ఆర్. సాయిబాబు, శ్రీమతి లక్ష్మి, శ్రీ కొండముది సుబ్బారావు దంపతులు, శ్రీ కొండముది ప్రేమకుమార్ దంపతులు, శ్యామల, శ్రీ బ్రహ్మాండం సుబ్బారావు, చి.సాయి. భరద్వాజ, శ్రీ ప్రదీప్కుమార్, శ్రీమతి నాగలక్ష్మి, శ్రీ మోహన్, శ్రీ వల్లూరి రమేష్బాబు, స్థానిక ఓరియంటల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల ప్రభృతులు పెద్ద సంఖ్యలో శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు.
24వ తేదీ మధ్యాహ్నం పూర్ణాహుతి తీర్థప్రసాద వితరణలతో హెూమకార్యక్రమం సంపూర్ణమైంది.
విద్యాస్వరూపిణి, జ్ఞానప్రదాత్రి అయిన “అమ్మ” సరస్వతీమూర్తిగా ఆహుతులు స్వీకరించి అందరినీ అనుగ్రహించింది.