1. Home
  2. Articles
  3. Mother of All
  4. ‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

‘మాతృశ్రీ’ జీవిత మహోదధిలో మణిరత్నాలు

D V N Kamaraju
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 18
Month : October
Issue Number : 4
Year : 2019

(గత సంచిక తరువాయి)

  1. గుర్రపుబండి తోలే ఖాదరువలి గురించి అమ్మ సీతాపతి తాతగారితో: “వాడిది చాలా గొప్ప హృదయం నాన్నా! మంచి చెడ్డలు కులంమీద ఆధారపడి లేవు. ”

సీతాపతి తాతగారు: అనవసరం మాటలెందుకు నీకు? చిన్న పిల్లవు. అమ్మ: అవును నాన్నా- అనవసర మాటలుగావు ఇవి. మాటలేగా! – అవసరం కలిగిన

సీతాపతి తాతగారు: అంతా చంద్రమౌళివారి పోలికలు వచ్చినాయి.

(చంద్రమౌళి వారంటే అమ్మమ్మ పుట్టింటివారు) అమ్మ: వారికి కోపమొచ్చినప్పుడేమో మన్నవ వారి పోలికలంటారు. మీకు కోపము వచ్చినప్పుడు చంద్రమౌళివారి పోలికలంటారు. నావి ఎవరి పోలికలూ

కావు. నాపోలికే మీ అందరికీ వచ్చింది.

56.”కరుణ లేకపోతే మనమే లేము. మనము చేసే పనులన్నీ కరుణ వల్లనే. నా దృష్టిలో కష్టసుఖాలు రెండూ కూడా కరుణవల్లనే. ప్రతి చిన్నపనీ మనం చేతులతో చేస్తున్నామనుకున్నా, మనసుతో చేస్తున్నామనుకున్నా, మనం ఎట్లాచేసినా వాడి కర్మ కనపడకుండా మనచేత చేయించబడుతున్న ప్రతి చిన్నపనీ వాడి కరుణే. మనకు కనపడకుండా ఆయా తరుణాల్లో ఆయా పనులు చేయించటమే కరుణ. కరుణ సముద్రం అల వంటిది. ఆ తరంగానికి తరుణం వచ్చినప్పుడు నీరే తరంగ మౌతుంది”.

“ఇంతకూ నీటికి గాలి ఒరిపిడేగా అల అంటే. శక్తి ఒకటయినా ఒక శక్తి రూపం ఎక్కువగా కనపడుటచేత మరొక శక్తిని గుర్తించలేము. ఎంతగాలి చేత అలలు వచ్చినా నీటికి కదిలే శక్తి లేకపోతే కదలించలేదు. 

57.లక్ష్మణాచార్యులుగారు పున్నమ్మగారితో, “అమ్మను మనము చూడకపోయినా మనలను చూస్తూనే వుంది.”

అమ్మ : చూస్తున్నానని చూచేవారు ఎంతటి వారో?

ఆచార్యులు : నీవెంతవారిని చేస్తే అంతవారు.

అమ్మ: అంతా వారే! వారే వీరు!

కూర్చున్న ఆచార్యులుగారు గబగబా లేచి అమ్మను ఎత్తుకుని తన కాషాయగుడ్డలతో అమ్మ ముఖము, కాళ్ళు చేతులు తుడిచి, “ఈతల్లి అర్ధమయ్యే తల్లికాదు. చెప్పినా అర్థం కాదు. అమ్మా! నాకు మాత్రం ఈ స్థితి మారకుండా చెయ్యి తల్లీ! నాకు 60 సంవత్సరాలు వెళ్ళిపోతున్నవి నీ లీలలన్నీ చూస్తానో చూడనో. నిన్ను నేను మీ అమ్మ పోయిన రోజు నుండీ గమనిస్తూనే వున్నాను. ఒకరోజు స్వప్నములో కనపడి నీ స్థితి అంతా నీవే చెప్పినట్లు, చివరకు నీవు నాతండ్రి నరసింహస్వామిగా కనిపించి ఇంతకుముందు నీవు అన్నమాట అంతా వారే, వారే వీరు అన్న శబ్దం ఆ కలలో కూడా వినిపించింది. ఆరోజు నుండి కలిగిన ఆందోళన, ప్రేమ, భక్తి, ఈరోజుకు దృఢపడినై. రూపము కూడా ఆనాడు చూచినదే”.

(లక్ష్మణాచార్యులుగారు నృసింహోపాసకులు. గంభీరమయిన విగ్రహం, నిత్యమూ చిదంబరరావుగారింటికి వచ్చి పోతూ ఉంటారు). 

58.చిదబరరావుగారి తల్లి నరసమ్మగారు మంచంలో పడుకుని మూలుగుతూ వుంటారు. లక్ష్మణాచార్యులుగారు వచ్చి “జ్వరం వస్తున్నదా” అని అడుగుతారు. చిదంబరరావుగారు: “లేదు. రంగమ్మ తల్లి పోయినప్పటి నుండి ఈమె ఇట్లాగే వున్నారు జబ్బేమీ లేదు. మానసిక బాధే, చెప్పినమాట అర్థం చేసుకోలేదు. చెప్పినమాటే చెపుతూ వుంటుంది. అన్నం రెండు మూడురోజులకు ఒకసారి తింటూ వుంటుంది.”

ఆచార్యులుగారు : “నేను లేపి చూస్తాను” అని మంచం దగ్గరకు వెళ్ళి ఆమె వెన్ను రాస్తూ “అమ్మా! తల్లీ! లే! అన్నం పెడుదువుగాని నాకు’ అని, అమ్మతో “అమ్మా! బాలా త్రిపురసుందరీ। నీవొచ్చి లేపు లేస్తుంది” అంటారు. అమ్మ లేచివచ్చి ‘తాతమ్మా!” అని అనగానే ఆమె లేచి కూర్చుంటుంది. అమ్మ

పెద్దగా కూడా పిలవదు.

“చూచారా పున్నమ్మగారూ – బాలాత్రిపురసుందరీ అంటే – ఎవరూ లేరంటిరే. లక్షణాలు కనిపెడుతూ ఉండంది. లక్ష్మణాచార్యులుగారు అత్యుత్సాహంతో అన్నారు.

అమ్మ: “కనిపెడితే కనపడేవి కావు. కనపడితే కనిపెట్టేవి. మీ ప్రయత్నాలు లేవు.”

ఆ మాటలకు చిదంబరరావుగారూ, ఆచార్యులుగారూ ఒకరి కన్నుల్లోకి ఒకరు చూచుకున్నారు. ఆ కన్నుల్లో వెలిగిన ఆనందజ్యోతుల కాంతుల్లో ఇద్దరూ పరవశులైనారు.

  1. ఆరోజు తిథి ఏకాదశి.

లక్ష్మణాచార్యులుగారు అమ్మను ఇంట్లోకి తీసుకెళ్ళి దేవతార్చనకెదురుగా కూర్చోబెట్టి ఇద్దరూ మాట్లాడకుండా మూడు గంటలసేపు కూర్చుంటారు. తరువాత కళ్ళు తెరచి, “తల్లీ! ఇంతకూ నీవెవరమ్మా చెప్పు? రెండు మూడు నెలల నుండీ ఈ ఆలోచన కలిగింది. ఏవమ్మా మాట్లాడవేం. ఎవరమ్మా? పోనీ నేనెవరినో చెప్పు. పలుకమ్మా! పలుకుగల తల్లీ ! పలకవేమి తల్లీ!” అమ్మ: నీవు పలికే పలుకే నేను నాయనా!

ఆచార్యులుగారు వెంటనే అమ్మను కౌగలించుకుని “అమ్మే నేను – నేనే అమ్మ” అని పునశ్చరణ చేస్తూ లేచి 41 కొబ్బరికాయలు కొట్టి, నారింజకాయంత ముద్ద కర్పూరము వెలిగించి, “అమ్మా! నీచేతి మీదుగా ఏదయినా వ్రాసి ఇయ్యమ్మా” అని పుస్తకం అందించారు. అమ్మ పుస్తకం అందుకుని “ఏమి వ్రాయమంటారు” అని అడిగింది.

“వెలితిలేనిదిగా నీ ఇష్టమొచ్చింది రాయమ్మా!”

జానెడు కైవారంగల పెద్ద సున్నా చుట్టింది అమ్మ. వెంటనే ఆ సున్నాను కళ్ళకద్దుకుని “ఎన్ని అర్థాలు గల అక్షరాన్ని ఇచ్చావమ్మా”! 

అమ్మ: పక్కన ఏ అక్షరం లేనప్పుడు అది వట్టిదేగా!

ఆచార్యులుగారు : “ప్రక్క అక్షరం లేనప్పుడు ప్రపంచమంతా ఇదేననీ, నేనేననీ చూపిస్తున్నావమ్మా. నా అనుభవాలన్నీ మన ఇంట్లోవాళ్ళతో చెప్పమంటావా అమ్మా?”.

అమ్మ: చెప్పినా అది వారి అనుభవము కాదుగా నాయనా! 

  1. రాత్రి 12 గంటలకు అమ్మ, ఆచార్యులుగారు చిదంబరరావుగారి ఇంటికి వస్తూ వుండగా, త్రోవలో పెద్ద త్రాచు ఇద్దరిమధ్యనా నిలుచుని వున్నట్లు కనపడుతుంది. సర్పం హఠాత్తుగా ఆచార్యులుగారి నిలువునా లేచి తోకమీద నిలబడి వారి వంకనే చూస్తూ ఉంటుంది. ఆయన నిశ్చేష్ఠుడై నిలిచి చలనం లేనివాడైపోతాడు. ఒక అరగంటకు కళ్ళు తెరుస్తాడు. పాము అమ్మను చుట్టుకున్నట్లుగా ఆయనకు కనపడుతుంది. ఆయన వెంటనే అమ్మ పాదాలమీద పడి “నేను పాము అంటే భయము లేనివాడిని. ఈ పామును చూస్తే ఎందుకింత  భయం కలిగింది. ఇది పాము కాదేమో! అయినా నిన్ను చుట్ట వేసుకుందేమమ్మా?”

అమ్మ: పాము కాదు నాయనా, నాగేంద్రుడు. ఆ నాగేంద్రుడే నన్ను చుట్టుకుని వున్నాడు నేను నాగేంద్రుడ్ని చుట్టించుకున్నాను ఆ నాగేంద్రుడే నాగేశ్వరుడై వస్తాడు. వాడే నాకాధారం. వాడి ఆకారమే నేను,

  1. ఆచార్యులుగారు పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ, “అమ్మా! అమ్మా! ముగురమ్మల మూలపుటమ్మా! నీకాధారమేమిటమ్మా! నీవే ఆధారం” అమ్మ: “ముగురమ్మల మూలపుటమ్మ అంటే, ఆదియై, అనాదియై, ఈనాటికిది

అయింది. ముగ్గురు మూర్తులకు తల్లి మూలపుటమ్మ- మూడు భాగాలై, అన్ని అవస్థలు మూడుగా చేసి, తను బాలై, బాలా త్రిపురసుందరై, మూడు కాలాలు, మూడు పూటలు, ముగ్గురు మూర్తులకు భార్యలై మూడు గుణములై – ఆమూడే సత్త్వ, రజస్తమోగుణములై ప్రపంచమైనది. ప్రపంచమంటే ఒక భూతంలో నుండి అనేకంగా పంచబడినది. అందుకే నాకు ఆధారం కావలసి వచ్చింది.

“అమ్మా! లోకజననీ! నృసింహస్వామికీ తల్లివా అమ్మా?”. 

“మళ్ళీ అట్లా అంటారేమి?”

“ఏమీ లేదమ్మా! తృప్తిలేక – ఆనందం పట్టలేక, అమ్మా! ఇప్పుడు చిన్న పిల్లవుగా కనపడటం లేదమ్మా! సాక్షాత్ ఆకాశానికీ, భూమికీ నీవే అంటుకుపోయినట్లుగా కనపడుతున్నావు. భయం పుడుతున్నది. ఆనందమూ కలుగుతున్నది” అంటూ గద్గద స్వరంతో ‘రండర్రా రండి. చూడండర్రా, ఆదిమూర్తి మా నరసింహస్వామిని రండర్రా రండి” అని పెద్దగా కేకలు పెట్టగా ఇళ్ళల్లో నిద్రలు పోయేవారంతా లేచి వస్తారు. అమ్మ జనమంతా బయటకు వచ్చేసరికి నెమ్మదిగా ఇంటికి వెళ్ళి పోతుంది.

  1. ఒకరోజు సాయంకాలం ఇంట్లోని వారందరూ కూర్చుని ఉండగా ఆచార్యులుగారు “ఇంతకూ ఈ తల్లి ఎవరి భార్య కావలసి ఉన్నదో! అయిన సంబంధాలేమయినా వున్నయ్యా?” అని అడుగుతారు. ఎవరూ మాట్లాడరు. 

అమ్మ: ఆయనే సంబంధం. అయిన సంబంధాలేమున్నయి? సంబంధమే ఆయన, బంధమే ఆయన.

ఆచార్యులుగారుః ఆయన యెవరని?

అమ్మ: మీరుగూడా అడుగుతారేం. మొన్ననే చెప్పానుగా.

ఎవరూ ఈ మాటలు వినిపించుకోకుండా ఎవరి మాటలలో వారు వుంటారు. చిదంబరరావుగారు మాత్రం తల వూపుకుంటూ వింటారు.

ఆచార్యులుగారు : సీతాపతీ నీది రత్నగర్భమయ్యా ! 

అమ్మ: అందరిదీ రక్త గర్భమే !!

ఆచార్యులుగారు: పోనీ ఆ రక్తం కూడా అందరి రక్తం లాంటిది కాదమ్మా! 

అమ్మ: అందరి రక్తం కలసిన రక్తం. 

ఆచార్యులుగారు: అందరికీ అర్థం కావు తల్లీ!

63.ఆరోజు నరక చతుర్దశి, తెలవారు జామున అందరూ తలంట్లు పోసుకుని, మధురపేణి అనే పిండివంట అందరూ తింటారు. అమ్మ చిదంబరరావు తాతగారితో “ఈ పండుగయొక్క వుద్దేశం చెప్పండి” అని అడుగుతుంది. చిదంబరరావుగారు: దుర్మార్గుడైన రాక్షసుని వధించిన రోజు. అమ్మ: ఎవరు వధించారు?

చిదంబరరావు గారు: కృష్ణపరమాత్మ.

అమ్మ: కృష్ణుడు భగవంతుడేగా. తనకు కూడా దుర్మార్గులున్నారా? అన్నీ 

చిదంబరరావుగారు: ఏమిటో – పురాణాలు దుష్టశిక్షణ, శిష్టరక్షణ అని రెంటినీ తనలో నుంచే వచ్చినవి గదా!

చెపుతూనే ఉన్నాయి.

అమ్మ: భగవంతుడుగా పూజింపబడేవారిలో ఇంతకూ ఎవరైనా ఆ ద్వంద్వం లేనివారున్నారా?

చిదంబరరావుగారు: ఇప్పటికిరాలేదు. ఇక వస్తారేమో తెలియదు.

  1. అమ్మ చిదంబరరావు తాతగారితో “భగవంతుడంటే నామ రూపాలున్నయ్యా? అతనికి సంకల్పాలున్నయ్యా లేదా?”

చిదంబరరావుగారు: శాస్త్రాలు నామరూప రహితుడనీ, సంకల్ప రహితుడనీ అంటున్నాయి.

అమ్మ: అన్ని రూపాలూ ఆయన కావటంచేత ఆయనకు వేరే రూపం లేదు. కనుక రూపం లేని వాడనా? అందరి సంకల్పాలు ఆయన సంకల్పమే గనుక ఆయనకు వేరే సంకల్పము లేదనా? అన్ని నామాలూ ఆయన నామమే. ఆయన సంకల్ప రహితుడు కాదు. సంకల్ప సహితుడు. సంకల్ప రహితమైన సంకల్పం.

చిదంబరరావుగారు: రహితమైన సంకల్ప మేమిటి?

అమ్మ: రెండు లేనిది (ద్వంద్వం తానైనది) రెండూ తానైనది. రెండుగా తోచినప్పుడు వికారాలు కలుగుతాయి. రెండు ఒకటిగా తోచినప్పుడు రాగరహితుడై అనురాగ సహితుడై ఉంటాడు.

  1. చిదంబరరావు గారు మేడమీద కిటికీ వద్ద కూర్చున్న అమ్మ దగ్గరకు వచ్చి “ఏమమ్మా? ఒంటరిగా ఏం చేస్తున్నావమ్మా?” అని అడుగుతారు. 

అమ్మ: నేనెప్పుడూ ఒంటరిదాన్ని కాదు. నాలో అందరూ వున్నారు. 

చిదంబరరావుగారు: అందరూ నీలో ఎట్లా వున్నారు? వేరుగానే

కనపడుతున్నారుగా?

 అమ్మ: అంటే నా మనస్సులో అందరూ గుర్తు వస్తూనే వున్నారు. అనేకం, అనేకమంది, అనేక విషయాలు. ప్రపంచమంతా మనసుతో నెమరు వేసుకుంటున్నాను నా ఒక్క మనస్సు అనేకమయిందని గుర్తిస్తున్నా. అందువల్లనే నేనే అన్నీ అయినానని, నేను ఒంటరిదాన్ని కాదన్నాను.

(సశేషం…)

 

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!